Amardeep
Amardeep : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ బిగ్ బాస్ లో పాల్గొని మరింత వైరల్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అమర్ దీప్ చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధల్ని బయటపెట్టాడు.
అమర్ దీప్ మాట్లాడుతూ.. నా మెంటల్ స్టేటస్ ఒకప్పుడు సరిగ్గా లేదు. ఎక్కువగా ఆలోచిస్తాను. పాతవి అన్ని గుర్తుకు తెచ్చుకొని మరీ ఆలోచిస్తాను. నేను కరెక్ట్ గా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఒక మూడు రోజులు పడుకుంటే ఒక మూడు రోజులు సరిగ్గా పడుకొను. నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, నేను అనుకున్నది ఒకటి ఇప్పుడు ఉన్నది ఒకటి అని ఎక్కువగా ఆలోచిస్తా. నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ వాడతాను. యాంగ్జైటీ టాబ్లెట్స్ కూడా వాడతాను. వాటిని దాటాలని చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. కర్మని నేను నమ్ముతాను. ఒకప్పుడు నేను కొంతమందిని బాధపెట్టి ఉంటాను. అది ఇప్పుడు నాకు రివర్స్ అయింది. నేను తెలిసే కొంతమందిని బాధపెట్టాను. ఒకానొక సమయంలో నేను సూసైడ్ కూడా ట్రై చేశాను అని చెప్పుకొచ్చాడు.
Also Read : Bigg Boss Soniya Akula : బిగ్ బాస్ సోనియా సీమంతం వేడుకలు.. ఫొటోలు..
అలాగే.. నాగచైతన్య శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో ఓ సీన్ చేశాను. కానీ ఎడిటింగ్ లో తీసేసారు. సినిమాలో సీన్ లేదు. మురళీ శర్మ గారి కాంబోలో చేశాను. డబ్బింగ్ కూడా చెప్పాను. టైటిల్ రోల్స్ లో పేరు మాత్రం ఉంది కానీ సినిమాలో నా పాత్ర లేదు. జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మొగాడివోయ్, కృష్ణార్జున యుద్ధం.. ఇలా చాలా సినిమాల్లో చేశాను కానీ ఎడిటింగ్ లో తీసేసారు. చాలా సినిమాల్లో ఇలానే పోయింది. చిన్న చిన్న పాత్రలు చేశాను. జూనియర్ ఆర్టిస్ట్ గా మొదటిసారి మనోజ్ నంద సినిమాలో చేసాను. అప్పుడు 350 రూపాయలు ఇచ్చారు అని తెలిపాడు అమర్ దీప్.