Site icon 10TV Telugu

Bindu Madhavi: త్రిష బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేశా.. బిందు మాధవి వైరల్ కామెంట్స్!

Bindu Madhavi About Dating Trisha Ex-Boyfriend

Bindu Madhavi About Dating Trisha Ex-Boyfriend

Bindu Madhavi: టాలీవుడ్ బ్యూటీ బిందు మాధవి కెరీర్ స్టార్టింగ్‌లో మంచి అవకాశాలను చేజిక్కించుకుంది. అయితే, అమ్మడికి సక్సెస్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. దీంతో అడపాదడప సినిమాల్లో నటిస్తూ వస్తోంది ఈ బ్యూటీ. కాగా, బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీ షోతో సాలిడ్ గుర్తింపును తెచ్చుకుంది. ఇక బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన బిందు మాధవి ప్రస్తుతం మరోసారి అవకాశాలను అందుకుంటుంది.

Bindu Madhavi: అదరహో అనిపిస్తున్న బిందు మాధవి అందాలు!

ఈ క్రమంలోనే ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’ మే 12 నుంచి ఆహా ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. తాజాగా న్యూసెన్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో న్యూసెన్స్ టీమ్ పాల్గొంది. అయితే, ఈ ప్రెస్‌మీట్‌లో బిందు మాధవికి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురయ్యింది. ఆమె త్రిష బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అందులో కొంత నిజం, కొంత అబద్ధం ఉందని చెప్పింది. త్రిష బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమించిన మాట నిజమే కానీ.. ఒకేసారి తామిద్దరం ప్రేమించలేదని బిందు మాధవి స్పష్టం చేసింది. త్రిష అతడికి ఎక్స్ అయ్యాకే తాము ప్రేమలో పడ్డామంది.

Bindu Madhavi : షార్ట్ డ్రెస్‌లో క్యూట్‌గా బిందు మాధవి

ఇలా త్రిష మాజీ ప్రియుడితో బిందు మాధవి డేటింగ్ చేసిందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడంతో బిందు మాధవి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక న్యూసెన్స్ వెబ్ సిరీస్‌లో నవదీప్ లీడ్ రోల్ చేస్తుండగా, బిందు మాధవి హీరోయిన్‌గా నటించింది.

Exit mobile version