మోడీ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జీవితకథ ఆధారంగా తెకెక్కిన పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఒమంగ్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఎన్నికల ఫలితాల తర్వాత విడుదల కానుంది. మే-24,2019న ఈ మూవీ విడుదల కానుంది. 

వాస్తవానికి ఏప్రిల్ లోనే ఈ మూవీ విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న కారణంగా ఎన్నిక‌ల సంఘం అధికారులు ఈ మూవీని నిషేదించారు. ఎన్నికలు పూర్తయ్యే మే-19,2019వరకు మోడీ బయోపిక్‌ను రిలీజ్ చేయోద్దని ఇటీవ‌ల‌ ఈసీ నిర్ణయం తెలిపిన విషయం తెలిసిందే.ఈసీ  నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జ‌రిపి ఈసీ తీర్పునే తుది నిర్ణ‌యంగా ప్ర‌క‌టించింది.

చిత్ర రిలీజ్ వాయిదా ప‌డ‌క త‌ప్ప‌లేదు. అయితే లోక్ సభ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత మే-24,2019న ఈ సినిమాను విడుదల చేయాలని తాము నిర్ణయించామని శుక్రవారం(మే-3,2019) మూవీ నిర్మాతల్లో ఒకరైన సందీప్ సింగ్ ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో అమిత్ షా పాత్రలో మనోజ్ ‌జోషి నటిస్తుండగా. మోడీ తల్లి హీరాబెన్‌ పాత్రలో ప్రముఖ సీనియర్ నటి జరీనా వాహబ్ క‌నిపించ‌నుంది. ఇక మోడీ భార్య‌ జశోదాబెన్‌ పాత్రని బర్ఖా బిస్త్ సేన్‌ గుప్తా చేస్తుంది.