మాట అగ్ని పర్వతం.. మనసు మంచు పర్వతం..
మూర్చి 19- మంచు మోహన్ బాబు తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు..

మూర్చి 19- మంచు మోహన్ బాబు తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు..
డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ, డాక్టర్. మంచు భక్తవత్సలం నాయుడు.. (మోహన్ బాబు) పుట్టినరోజు ఈరోజు (మార్చి 19).. ఈ సంవత్సరంతో ఆయన 70వ పడిలోకి అడుగుపెడుతున్నారు. కోరానా వైరస్ కారణంగా తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో జరగాల్సిన పుట్టినరోజు వేడుకలను రద్దు చేస్తూ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మోహన్ బాబు. బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. 500లకు పైగా సినిమాలు.. నిర్మాతగా 50కు పైగా చిత్రాలు, ఎంతో మంది విద్యావేత్తలకు గురువు, కులమతాలకు అతీతంగా విద్యా దానం చేస్తూ భావితరాలకు ప్రేరణగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి మోహన్ బాబు.. అంటూ పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కుమార్తె లక్ష్మీ మంచు ‘మా నాన్న పుట్టినరోజు.. ప్రతీ సంవత్సరం ఈరోజు మాకు పండుగ రోజు.. మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ.. Love You to the Moon and Back’ అంటూ ట్వీట్ చేశారు. సినిమాల విషయానికొస్తే తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘సూరరైపోట్రు’ (ఆకాశం నీ హద్దురా) చిత్రంలో నటిస్తున్నారు. మాటఅగ్నిపర్వతం, మనసు మంచు పర్వతం.. మోహన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు..