తిట్టిపోస్తున్న హిందీ వాళ్లు : ట్రాఫిక్ ఫైన్స్ పెంచటానికి కారణం భరత్ అనే నేను సినిమానే

టైటిల్ చూసి షాక్ అయ్యారా.. ఇది అక్షర సత్యం. ట్విట్టర్ వేదికగా భరత్ అనే నేను సినిమాను ఏకిపారేస్తున్నారు వాహనదారులు. హిందీ వాళ్లు అయితే మరీనూ.. ట్రాఫిక్ చలాన్లను పెంచటం వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ ఉందని.. వాళ్ల వల్లే ఇంతింత ఫైన్స్ పెంచారని అంటున్నారు. నేరుగా కామెంట్లు చేసేస్తున్నారు. హైదరాబాద్ లో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు భారీగా జరిమానాలు పెంచుతాడు హీరో భరత్. సీఎం హోదాలో భయం, భక్తి ఉండాలని అంటాడు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కొత్త వాహన చట్టం వచ్చింది. అందులో జరిమానాలు భారీగా పెంచారు. దీనికి కారణం తెలుగు సినీ ఇంస్ట్రీనే అని హిందీవాళ్లు ట్రోల్ చేయటంమొదలు పెట్టారు. మహేష్ బాబు వీడియోను లింక్ చేసి.. దుమ్ముదులిపేస్తున్నారు.
భరత్ అనే నేను సినిమాలోని ఫైన్స్ ఇలా ఉన్నాయి
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే : రూ.10వేలు
సిగ్నల్ జంపింగ్ : రూ.20వేలు
మొబైల్ డ్రైవింగ్ : రూ. 25వేలు
ర్యాష్ డ్రైవింగ్ : రూ.20వేలు
కొత్తగా తీసుకొచ్చిన జరిమానాలు కూడా ఈ రేంజ్ లోనే ఉండటంతో హిందీ వాళ్లు అంతా తెలుగు సినీ ఇండస్ట్రీ వల్లే జరిగిందని అపోహపడుతున్నారు. మీరు పెట్టిన డైలాగ్స్ చూసే కేంద్రం ప్రభావితం అయ్యిందని.. మీ వల్లే అంతా అంటూ ట్విట్టర్ వేదికగా హిందీ వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మహేష్ వీడియోను లింక్ చేస్తున్నారు. భరత్ అనే నేను సినిమా డైలాగ్స్ చూసి ఇంత ఫైన్స్ పెంచటం జరిగిందనే ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు.
ఓ సినిమా చూసి కేంద్రం జరిమానాలు పెంచారనే కామెంట్స్ కామెడీగా ఉన్నా.. ఇవన్నీ పట్టించుకోవటం లేదు నెటిజన్లు. దీనిపై మూవీ డైరెక్టర్ కొరటాల ఎలా స్పందిస్తారో చూడాలి..
Blame Telegu movie industry for high traffic fines pic.twitter.com/CTbFqnh8dV
— Rahul Roushan (@rahulroushan) September 4, 2019
Want to know why hefty fines are imposed for traffic rules violation?
Mahesh Babu, superstar from the Telugu film industry, states the reasons.
P.S: Received as a Whatsapp forward#funvideo #TrafficFine #TrafficRules pic.twitter.com/WjanWpXENi— Sarang Bhalerao (@bhaleraosarang) September 4, 2019
Got the inspiration behind new traffic fines. #TrafficRules pic.twitter.com/6SR7KuraDh
— Kamalesh (@Drkamalesh7) September 3, 2019
Heavy traffic fines on traffic violations is inspired from this.
Part 1 pic.twitter.com/xF8tO05Hiz
— desi mojito ? (@desimojito) September 3, 2019