Ali Fazal & Richa Chadha : బెడ్‌రూమ్ సీన్లలో నటించినా ఫర్వాలేదు.. కాబోయే భార్యపై నటుడి షాకింగ్ కామెంట్స్
సినిమా అన్నాక నవరసాలు ఉంటాయి. అందులో శృంగారం కూడా ఒకటి దాదాపు ప్రతి సినిమాలోనూ రోమాంటిక్ సీన్లు ఉంటూనే ఉంటాయి. ఆయా దర్శకుల కోణంలో వాటిని చిత్రీకరిస్తూ ఉంటారు.

Ali Fazal & Richa Chadha
Ali Fazal & Richa Chadha : సినిమా అన్నాక నవరసాలు ఉంటాయి. అందులో శృంగారం కూడా ఒకటి దాదాపు ప్రతి సినిమాలోనూ రోమాంటిక్ సీన్లు ఉంటూనే ఉంటాయి. ఆయా దర్శకుల కోణంలో వాటిని చిత్రీకరిస్తూ ఉంటారు. తమిళ నటుడు కమలహాసన్ అయితే తన ప్రతి సినిమాలో హీరోయిన్‌తో ముద్దుసీను ఉండేట్టు స్క్రీన్ ప్లే రాయించుకుంటాడని టాక్…. కమల్ తో ముద్దుసీన్లులో నటించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అది వేరే విషయం అనుకోండి.
ఈమధ్య చాలా సినిమాల్లో ముద్దు సీన్లు కూడా ఉండేట్లు దర్శక నిర్మాతలు స్క్రిప్టు రెడీ చేయించుకుంటున్నారు. కాకపోతే చాలామంది హీరోయిన్లు పెళ్ళికి ముందు సినిమాల్లో ముద్దుసీన్లలో నటించినా పెళ్లి తర్వాత అలాంటి సీన్లకు అభ్యంతరం చెపుతుంటారు. తాజాగా మీర్జాపూర్ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు అలీ ఫాజిల్ తనకు కాబోయే భార్య రిచా చద్దా నటనలో భాగంగా బెడ్ రూం సీన్లలో నటించినా అభ్యంతరం లేదంటూ సెలవిచ్చాడు.

Ali Fazal & Richa Chadha
గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట పెళ్ళి చేసుకోవాలనుకునే సరికి కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇతర అనివార్య కారణాలతో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీట లెక్కబోతున్నారు.

Ali Fazal & Richa Chadda
మీరెప్పుడైనా పోసెసివ్‌గా ఫీలయ్యారా అని అడిగిని ప్రశ్నకు నటన అంటే రొమాన్స్ చేయటంతో పాటు ముద్దులు పెట్టుకోవటం కూడా భాగమేనని రిచా చద్దా చెప్పింది. అలీ ఫాజల్ కూడా ఆమె మాటలకు మద్దతిస్తున్నట్లు…. రిచా తనకు కాబోయే భార్యే…. అయినంత మాత్రాన ఆమె నటి కాకుండా పోదని….నటనలో భాగంగా బెడ్ రూం సీన్లలో నటించినా అభ్యంతరం లేదన్నాడు.

Richa Chadda
ఫక్రీ, ఫక్రీ రిటర్న్స్ అనే సినిమాలలో అలీఫాజిల్ , రిచా చద్దా కలిసినటించారు. వృత్తిలో బాగా డబ్బులు సంపాదించిన తర్వాతే పెళ్ళి చేసుకుంటామని చెప్పుకొచ్చారు ఈజోడి. కాగా అలీ ఫాజల్ తన భార్య బెడ్ రూం సీన్ల గురించి చేసిన కామెంట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.