Bijay Anand : ‘ఆదిపురుష్’ ట్రోల్స్‌పై నటుడు సంచలన వ్యాఖ్యలు.. నచ్చకపోతే సినిమా చూడటం మానేయండి..

ఇప్పటికే ఆదిపురుష్ సినిమాపై, ఓం రౌత్ పై వచ్చిన ట్రోల్స్ కి పలువురు పలు రకాలుగా స్పందించారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bijay Anand : ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ప్రభాస్(Prabhas), కృతిసనన్ సీతారాముళ్లుగా తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్. అయితే ఈ సినిమాపై రిలీజ్ ముందు నుంచి విమర్శలు వచ్చాయి. రిలీజ్ అయ్యాక అసలు అది రామాయణం కాదని, రామాయణాన్ని ఇష్టమొచ్చినట్టు మార్చేసాడని, 600 కోట్లు ఖర్చుపెట్టి కనీసం గ్రాఫిక్స్ కూడా సరిగ్గా చేయలేదని ఓం రౌత్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇప్పటికే ఆదిపురుష్ సినిమాపై, ఓం రౌత్ పై వచ్చిన ట్రోల్స్ కి పలువురు పలు రకాలుగా స్పందించారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ లో బ్రహ్మ పాత్రలో కనిపించారు. తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ ట్రోల్స్ పై స్పందించారు.

Also Read : Aavesham : మలయాళంలో మరో హిట్టు బొమ్మ.. ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’.. ఇది కూడా తెలుగులోకి వస్తుందా?

బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. కళని విమర్శించడం మంచి పద్ధతి కాదు. సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ విమర్శించడానికి మీరు ఎవరు? ఒక కళాకారుడు తనకు నచ్చినట్టు కళని రూపొందిస్తాడు. దాని కోసం డబ్బు, సమయం, తన కష్టం అంతా పెడతాడు. 600 కోట్లు ఖర్చు చేసి ఓం రౌత్ సినిమా తీసాడంటే అది అతని ఇష్టం. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. అంతేకాని అతన్ని విమర్శించడానికి మీరెవరు. కల మంచిదా, చెడ్డదా అని మీరు చెప్తే అయిపోదు. కొంతమంది కళాకారులను భయపెడుతున్నారు. ఓం రౌత్ ని అలాగే భయపెట్టారు. కానీ ఓం రౌత్ భయపడకుండా, ట్రోల్స్ ని పట్టించుకోకుండా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం అని అన్నాడు. దీంతో బిజయ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు