×
Ad

Actor Govinda : బాలీవుడ్ స్టార్ గోవిందాకు తీవ్ర అస్వస్థత.. హుటాహుటీన ఆస్పత్రికి తరలింపు..

Actor Govinda : బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో నిన్నరాత్రి సమయంలో

Bollywood actor Govinda

Actor Govinda : బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో నిన్నరాత్రి సమయంలో స్పృహతప్పి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహటీన ఆయన్ను.. తన నివాసానికి సమీపంలోని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

గోవింద ఆస్పత్రిలో చేరిన విషయంపై ఆయన స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ ప్రకటన చేశారు. ‘‘గోవిందాను ఆయన నివాసానికి సమీపంలోనే ఉన్న క్రిటికేర్ ఆస్పత్రిలో చేర్చించాం. అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. చాలా వరకు రక్త పరీక్షలు చేయించాం. వాటి రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

గత సంవత్సరం 61ఏళ్ల గోవింద తన లైసెన్స్ కలిగిన రివాల్వర్ ను తప్పుగా కాల్చడంతో అతని కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో అతని మోకాలి కింద గాయంతో జుహులోని తన ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ఆ సమయంలో గంటసేపు శస్త్రచికిత్స తరువాత వైద్యులు బుల్లెట్ ను బయటకు తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో అతను మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద తన లైసెన్స్ పొందిన రివాల్వర్ ను అల్మారాలో పెడుతుండగా అది కిందపడి పేలిందని, దీంతో అతని గాయాలైనట్లు తెలిపారు.