Junior Mehmood : బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ మరణం..

ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ క్యాన్సర్‌తో పోరాడి 67 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.

Bollywood Actor Naeem Sayyed known as Junior Mehmood passed away

Junior Mehmood : ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ ఈరోజు తెల్లవారుజామున తన నివాసంలో కన్నుమూశారు. మెహమూద్‌ కడుపు క్యాన్సర్‌తో పోరాడి 67 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఈ క్యాన్సర్ గురించి కూడా 18 రోజుల క్రితమే తెలిసిందట. అయితే అప్పటికే నాల్గవ దశలో ఉందట. ఆ దశలో చికిత్స మరియు కీమోథెరపీ ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంటుందని, చేసినా ఫలితం కూడా ఉండదని ఇంట్లోనే అతనిని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు సూచించారట.

Also read : Devil : ‘డెవిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన కళ్యాణ్ రామ్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో..

నేడు తెల్లవారుజామున 2:15 గంటలకు తన నివాసంలో జూనియర్ మెహమూద్ కన్నుమూశారు. జూనియర్ మెహమూద్ అసలు పేరు నయీమ్ సయ్యద్. మొహబ్బత్ జిందగీ హై (1966)లో జూనియర్ మెహమూద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 1968లో సుహాగ్ రాత్‌ సినిమాలో నయీమ్ సయ్యద్, స్టార్ కమెడియన్ మెహమూద్ తో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న తరువాత జూనియర్ మెహమూద్ అనే స్క్రీన్ పేరుని అందుకున్నారు. జూనియర్ మెహమూద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.