Bollywood Actress Kajol Fires on Photographers at Durga Pooja
Kajol : ప్రస్తుతం దేశమంతటా దసరా నవరాత్రులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దుర్గా మాత మండపాలాలలో చేస్తున్న పూజలలో పాల్గొని పూజలు నిర్వహించి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వాళ్ళ వెనకే తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీసే సపరేట్ ఫొటోగ్రాఫర్లు కొంతమంది ఉంటారని తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ముంబైలోని ఓ దుర్గా మాత మండపానికి వెళ్లగా అక్కడ నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కాజోల్. అయితే ఈ క్రమంలో ఆమె వెనకాలే కొంతమంది ఫొటోగ్రాఫర్లు మండపం లోపలికి కూడా చెప్పులు, షూలు వేసుకొని వచ్చారు. దీంతో కాజోల్ ఇది గమనించి వారిపై ఫైర్ అయింది.
Also Read : Nayani Pavani : బిగ్‌బాస్ లో బైక్ గెలుచుకున్న నయని పావని..
కాజోల్.. ముందు మీరు ఇక్కడ్నుంచి వెళ్ళండి. ఇది పూజా ప్రదేశం. చెప్పులు, షూలు తీసేసి రండి. ఇలాంటి ప్రదేశాల్లో కొంచెం గౌరవంగా వ్యవహరించండి అంటూ ఫొటోగ్రాఫర్లపై ఫైర్ అయింది. మైక్ తీసుకొని మరీ అరిచింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. పూజా ప్రదేశాల్లోకి చెప్పులు వేసుకురాకూడదని వాళ్లకు తెలీదా అంటూ ఫొటోగ్రాఫర్లపై మండిపడుతున్నారు.