Nayani Pavani : బిగ్‌బాస్ లో బైక్ గెలుచుకున్న నయని పావని..

గత సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి ఒక్క వారంలోనే వెళ్ళిపోయింది నయని పావని.

Nayani Pavani : బిగ్‌బాస్ లో బైక్ గెలుచుకున్న నయని పావని..

Nayani Pavani Wins Bike in Bigg Boss Season 8 Task

Updated On : October 12, 2024 / 7:26 AM IST

Nayani Pavani : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 సాగుతుంది. ప్రస్తుతం ఆరో వారం సాగుతుంది. ఇప్పటికే ఆరో వారం నామినేషన్స్ కూడా అయ్యాయి. వైల్డ్ కార్డు ఎంట్రీలతో ఆల్రెడీ ముందు నుంచి ఉన్న కంటెస్టెంట్స్ కి మధ్య యుద్ధమే నడుస్తుంది. టాస్కుల్లో బాగానే ఫైట్ చేసుకుంటున్నారు.

తాజాగా దమ్ముంటే స్కాన్‌ చెయ్‌ అనే ఓ గేమ్ పెట్టగా ఇందులో రెండు టీమ్స్ నుంచి విష్ణుప్రియ, నయని పావని వచ్చి ఆడారు. ఈ గేమ్ లో నయని పావని గెలవడంతో థమ్స్ అప్ స్పాన్సర్ చేసే థండర్‌ వీల్స్‌ బైక్‌ గెలుచుకుంది. దీంతో నయని పావని సంతోషం వ్యక్తం చేసింది. ఆ బైక్ పై కూర్చొని ఫోజులిచ్చింది నయని పావని. ఆమె ఫాలోవర్స్ ఆమెకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తున్నారు.

Also Read : Shayaji Shinde : మొన్న పవన్ కళ్యాణ్ ని కలిసి.. నేడు వేరే పార్టీలో చేరిన షాయాజీ షిండే..

గత సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి ఒక్క వారంలోనే వెళ్ళిపోయింది నయని పావని. మరి ఈ సారైనా ఎక్కువ రోజులు ఉంటుందా చూడాలి. ఇక నేడు శనివారం కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ పై ఏ రేంజ్ లో ఫైర్ అవుతాడో చూడాలి.