Mouni Roy : హాస్పిటల్‌లో హీరోయిన్.. 9 రోజులు చాలా బాధపడ్డాను..

తాజాగా మౌనిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. హాస్పిటల్ బెడ్ మీద నుండి తన భర్త చేతిని పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసింది.

Mouni Roy : హాస్పిటల్‌లో హీరోయిన్.. 9 రోజులు చాలా బాధపడ్డాను..

Bollywood Actress Mouni Roy joined in Hospital after nine days treatment discharged

Updated On : July 23, 2023 / 1:38 PM IST

Mouni Roy : బాలీవుడ్(Bollywood) భామ మౌనిరాయ్ తెలుగులో కూడా పరిచయమే. బాలీవుడ్‌లో సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మౌనిరాయ్ నాగిని(Nagini) సీరియల్ తో బాగా ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలతో కూడా మెప్పించింది. ఇటీవల బ్రహ్మాస్త్ర(Brahmastra) సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది మౌనిరాయ్. సోషల్ మీడియాలో మౌని రాయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే.

తాజాగా మౌనిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. హాస్పిటల్ బెడ్ మీద నుండి తన భర్త చేతిని పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో మౌని రాయ్ తన చేతికి సెలైన్ ఎక్కించుకుంటుంది. ఈ ఫోటోని షేర్ చేసి.. 9 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. ఈ రోజే డిశ్చార్జ్ అయ్యాను. అక్కడ ఉన్నన్ని రోజులు చాలా బాధని అనుభవించాను. ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నాను. ఇన్ని రోజులు నన్ను జాగ్రత్తగా చూసుకున్న హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను చికిత్స తీసుకుంటున్న సమయంలో నా భర్త ఎంతో తోడుగా నిలబడ్డాడు. జీవితాంతం అతనికి రుణపడి ఉంటాను అని తెలిపింది.

Varun tej : మాస్ దర్శకుడితో వరుణ్ తేజ్ మూవీ.. 1960 బ్యాక్‌డ్రాప్‌తో కథ.. నిజమేనా..?

దీంతో మౌని రాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే హాస్పిటల్ లో ఎందుకు చేరిందో చెప్పకుండా ఇదంతా పోస్ట్ చేయడంతో మౌనిరాయ్ కి ఏమైంది అంటూ అభిమానులు, పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మౌనిరాయ్ ఏ చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్లిందో తెలియాలి.