Urfi Javed wants to Sell her Dress with huge price
Urfi Javed : సెలబ్రిటీలు వాడిన వస్తువులు వేలం వేస్తే లక్షల్లో, కోట్లల్లో వేలం పాడుకొని పలువురు కొంటారని తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ భామ ఉర్ఫీ జావేద్ తన డ్రెస్సుని అమ్ముతాను అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. బిగ్ బాస్, సోషల్ మీడియాతో, పలు టెలివిజన్ షోలతో పాపులారిటీ తెచ్చుకుంది ఉర్ఫీ జావేద్. వాటికంటే కూడా బోల్డ్ గా కనిపిస్తూ కొత్త కొత్త వెరైటీ డ్రెస్సులు వేసి హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఉర్ఫీ జావేద్.
ఉర్ఫీ జావేద్ ఏదైనా కొత్త డ్రెస్ వేసిందంటే అది వైరల్ అవ్వాల్సిందే. అయితే తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఉర్ఫీ. బటర్ ఫ్లై డిజైన్ ఉన్న ఓ బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ టైప్ డ్రెస్ ని వేసుకొని ఉర్ఫీ జావేద్ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు షేర్ చేస్తూ.. నేను అందరికి నచ్చిన ఈ బటర్ ఫ్లై డ్రెస్ ని అమ్ముదామని ఫిక్స్ అయ్యాను. దీని ధర కేవలం 3 కోట్ల 66 లక్షల 99 వేలు మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అంటూ పోస్ట్ చేసింది.
Also Read : Kanthi Dutt : హీరోయిన్స్ నే మోసం చేసిన ఘనుడు.. లిస్ట్ లో సమంత, కీర్తి సురేష్.. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా..
దీంతో ఉర్ఫీ జావేద్ పోస్ట్ వైరల్ గా మారింది. రెగ్యులర్ గా కొత్త కొత్త డ్రెస్సుల్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేసే ఉర్ఫీ ఇప్పుడు ఒక డ్రెస్ లో ఫొటోలు పెట్టి ఏకంగా 3 కోట్ల పైన రేటు చేపి ఎవరైనా కొంటారా అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పలువురు నెటిజన్లు ఈ విషయంలో ఉర్ఫీ జావేద్ ని ట్రోల్ చేస్తున్నారు. ఆ డ్రెస్ ని అంత రేటు పెట్టి ఎవరైనా కొంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఉర్ఫీ జావేద్ కి ఏం అవసరం వచ్చిందో అంత డబ్బులు కావాలని పెట్టింది, ఇంత కాస్ట్ పెట్టి ఉర్ఫీ డ్రెస్ ని ఎవరు కొంటారో చూడాలి.