Kanthi Dutt : హీరోయిన్స్ నే మోసం చేసిన ఘనుడు.. లిస్ట్ లో సమంత, కీర్తి సురేష్.. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా..

తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్ అధినేత పలువురు సెలబ్రిటీలను, డబ్బున్న వాళ్ళను, హీరోయిన్స్ ని మోసం చేసాడు.

Kanthi Dutt : హీరోయిన్స్ నే మోసం చేసిన ఘనుడు.. లిస్ట్ లో సమంత, కీర్తి సురేష్.. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా..

jewelry shop owner scammed actresses and businessmen

Updated On : December 1, 2024 / 11:01 AM IST

Kanthi Dutt : ఇటీవల కొత్త రకాల మోసాలు ఎక్కువయిపోయిన సంగతి తెలిసిందే. కొంతమంది అయితే ఏకంగా సెలబ్రిటీలకే టోకరా వేస్తున్నారు. తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్ అధినేత పలువురు సెలబ్రిటీలను, డబ్బున్న వాళ్ళను, హీరోయిన్స్ ని మోసం చేసాడు. తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్ మీద తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజ రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త పెట్టుబడులు పెట్టించినట్టు సమాచారం. ఆమె మోసపోయానని గ్రహించి తాజాగా కాంతి దత్ మీద పోలీస్ కేస్ పెట్టింది.

అలాగే ఇతను పరిణీతి చోప్రాకు కూడా వ్యాపారంలో షేర్ ఇస్తాను అంటూ మోసం చేసాడని, ఫోర్జరీ సంతకాలతో పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసి కోట్లలో డబ్బులు వసూలు చేసాడని అభియోగాలు వచ్చాయి. ఇతను గతంలో సస్టెయిన్ కార్ట్ అనే సంస్థ స్థాపించి సమంత, ప్రముఖ డిజైనర్ శిల్ప రెడ్డి, కీర్తి సురేష్ లతో కూడా పెట్టుబడులు పెట్టించాడు. ఆ సంస్థతో కూడా వీళ్ళను మోసం చేసాడని తెలుస్తుంది. గతంలోనే దీనిపై వార్తలు రాగా ఇటీవల అతను మోసం చేయలేదని, అవన్నీ అబద్దాలు అని తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు.

Also Read : First Day Collections Records : ఇలాంటి ట్రిక్కులు వాడి ఫస్ట్ డే రికార్డులు సెట్ చేస్తున్న భారీ సినిమాలు..

కాంతి దత్ మోసం చేసిన లిస్ట్ లో కీర్తి సురేష్, సమంత, పరిణీతి చోప్రా, డిజైనర్ శిల్ప రెడ్డితో పాటు పలువురు హీరోయిన్స్, వ్యాపారవేత్తలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇతను దాదాపు 100 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కూడా కాంతి దత్ పై కేసులు నమోదు అయ్యాయి. కాంతి దత్ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే శ్రీజ రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు కాంతి దత్ ని అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సమంత ఫ్రెండ్, డిజైనర్ శిల్ప రెడ్డి గతంలో సస్టెయిన్ కార్ట్ కంపెనీ పద్ధతులు బాగోలేవని, దాంట్లోంచి బయటకు వచ్చేసానని, కాంతి దత్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.