First Day Collections Records : ఇలాంటి ట్రిక్కులు వాడి ఫస్ట్ డే రికార్డులు సెట్ చేస్తున్న భారీ సినిమాలు..

గత కొంతకాలంగా సరికొత్తగా ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు వేస్తున్నారు.

First Day Collections Records : ఇలాంటి ట్రిక్కులు వాడి ఫస్ట్ డే రికార్డులు సెట్ చేస్తున్న భారీ సినిమాలు..

Star Heros Big Budget Movies creates new Ways for First Day Collections Records

Updated On : December 1, 2024 / 10:27 AM IST

First Day Collections Records : ఇటీవల కొంతమంది ఫ్యాన్స్, కొంతమంది హీరోలు వాళ్ళ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులు అదిరిపోవాలి అని చూస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో RRR 223 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో బాహుబలి 217 కోట్లు, కల్కి 191 కోట్లతో ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలంతా తమ రాబోయే సినిమాలతో ఈ రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నారు.

త్వరలో డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా రాబోతుంది. పుష్ప 2 సినిమా RRR మొదటి రోజు కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయాలని చూస్తుంది. అయితే గతంలో ఫస్ట్ డే అంటే రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ తో రికార్డులు చెప్పేవాళ్ళు. కానీ గత కొంతకాలంగా సరికొత్తగా ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు వేస్తున్నారు.

ఇటీవల ప్రీమియర్ షోలు అని చెప్పి ముందు రోజు రాత్రే సినిమాలు వేస్తున్న సంగతి తెలియసందే. ఇక బెనిఫిట్ షోల సంగతి సరే సరి. కొన్ని సినిమాలు రిలీజ్ ముందు రోజు రాత్రే స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నాయి. దీంతో ఈ ప్రీమియర్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ కూడా మొదటి రోజు కలెక్షన్స్ లో కలిపేసుకుంటున్నారు. చిన్న, మీడియం సినిమాలు అయితే ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ వేసి కలెక్షన్స్ రాబట్టుకుంటున్నారు.

Also Read : Pushpa 2 : తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 హిట్ అవ్వాలంటే.. ఏకంగా అన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాల్సిందే..

కొన్ని సినిమాలు ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నాయి. పుష్ప 2కి ఆల్మోస్ట్ నెల రోజుల ముందే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇలా సినిమా గురించి ముందుగానే ప్రమోట్ చేసి టికెట్లు బుక్ చేసుకునేలా చేస్తున్నారు. రిలీజ్ సమయానికి బుకింగ్స్ అయిపోతే ఇంకా ఎక్కువ షోలు వేసుకోవచ్చు అనే ప్లాన్ లో ఉంటున్నారు. దీనివల్ల కూడా కలెక్షన్స్ బాగానే పెరుగుతున్నాయి.

ఇక టికెట్ రేట్లు సరేసరి. ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటంతో పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు తమ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచేస్తున్నారు. మొదటి వీకెండ్ వరకు టికెట్ రేట్లు భారీగా పెడుతున్నారు. మన తెలుగోళ్ల సినిమా బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇక బెనిఫిట్ షోలకు అయితే 1000 రూపాయలు మినిమమ్ లేనిదే టికెట్ దొరకదు. ఇప్పుడు పుష్ప 2కు అధికారికంగానే 1100 పైన టికెట్ రేటు ఉండటం గమనార్హం. ఇంతింత టికెట్ రేట్లు పెంచి కలెక్షన్స్ ఎక్కువ వచ్చేలా చూసుకుంటున్నారు.

మరోటి కొత్త దేశాల్లో రిలీజ్ చేయడం. ఒకప్పుడు ఓవర్సీస్ అంటే అమెరికా మాత్రమే. కానీ ఇప్పుడు మన తెలుగువాళ్లు ఏ దేశంలో ఉంటే ఆ దేశాల్లో సినిమాలను రిలీజ్ చేస్తూ మన సినిమా స్థాయిని పెంచుతూనే కలెక్షన్స్ కూడా పెంచుకుంటున్నారు.

Also Read : Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ఏం చదువుకున్నారో తెలుసా.. అప్పట్లోనే అంత డిఫరెంట్ గా చదివి..

ఇవన్నీ ఎందుకంటే ఒకవేళ సినిమా అటు ఇటు అయినా రెండో రోజు నుంచి లేదా మొదటి వీకెండ్ నుంచి సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కుదిరినంత కలెక్షన్స్ మొదటి రోజే రప్పించేయాలని ఇలాంటి ప్లాన్స్ చేసి ఫస్ట్ డే రికార్డులు అని చెప్పుకుంటున్నారు. వీళ్లకు తోడు ఫ్యాన్స్ మా హీరో ఇంత మీ హీరో ఇంత అని ఫ్యాన్ వార్స్ చేసుకోడానికి ఇవి బాగా పనికొస్తున్నాయి.

ఇలా ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు కలెక్షన్స్ విషయంలో, ఫస్ట్ డే విషయంలో రికార్డుల కోసం కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఒకప్పుడు పోకిరి, మగధీర లాంటి సమయాల్లో కొన్నేళ్ల క్రితం బాహుబలి 2 సమయంలో కూడా ఇన్ని లేకుండానే, ఇప్పటికంటే చాలా తక్కువ టికెట్ ధరలతోనే భారీ కలెక్షన్స్ రాబట్టి పెద్ద హిట్ అయ్యాయి. ఆ రకంగా పోలిస్తే ఇప్పుడు వచ్చే సినిమాలు ఇన్ని టెక్నిక్స్ వాడి కలెక్షన్స్ విషయంలో హిట్ అనిపించుకోవడం వింతే.