Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ఏం చదువుకున్నారో తెలుసా.. అప్పట్లోనే అంత డిఫరెంట్ గా చదివి..
రాజేంద్ర ప్రసాద్ బాగా చదువుకోని అనంతరం సినిమాల మీద ఇష్టంతో సినిమాల్లోకి వచ్చారు.

Do You Know About Rajendra Prasad Study Here Details
Rajendra Prasad : ఎన్నో కామెడీ సినిమాలతో హీరోగా మెప్పించిన రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి ఎమోషనల్ కంటెంట్ సినిమాలతో కూడా ప్రేక్షకులని మెప్పించారు. ఆల్మోస్ట్ 40 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తూ.. ఇంకా వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్.
అయితే రాజేంద్ర ప్రసాద్ బాగా చదువుకోని అనంతరం సినిమాల మీద ఇష్టంతో సినిమాల్లోకి వచ్చారు. రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులోనే పుట్టారు. ఆయన తండ్రి స్కూల్ టీచర్ కావడంతో ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్ గా ఉండి బాగా చదివించారు. రాజేంద్రప్రసాద్ గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 1970 లలోనే సిరామిక్స్ లో ఇంజనీరింగ్ చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read : Bigg Boss Elimination : శనివారమే బిగ్‌బాస్ లో ఎలిమినేషన్.. ఆదివారం ఇంకొకరు..
అయితే అప్పట్లోనే అంత బాగా చదివిన రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ మీద ఇష్టంతో సినిమాలపై ఇష్టం ఏర్పడి సినిమాల్లోకి వెల్దామనుకున్నాడు. ఇంట్లో ఒప్పుకోకపోయినా ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమ రావు సలహాతో చెన్నై లోని ఓ ఫిలిం స్కూల్ లో రెండేళ్లు కోర్స్ చేసాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీ అయి అనంతరం హీరో అయ్యారు రాజేంద్రప్రసాద్. ఇటీవల చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు కూడా సినిమాల మీద ఇష్టంతో సినీ పరిశ్రమలోకి వస్తున్నారు. కానీ అప్పట్లోనే రాజేంద్రప్రసాద్ ఓ కొత్త కోర్స్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి సినిమాల్లోకి రావడం గమనార్హం.