Pushpa 2 : తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 హిట్ అవ్వాలంటే.. ఏకంగా అన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ 650 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

Pushpa 2 : తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 హిట్ అవ్వాలంటే.. ఏకంగా అన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాల్సిందే..

Allu Arjun Pushpa 2 Telugu States Theatrical Business Details

Updated On : December 1, 2024 / 10:15 AM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 4వ తేదీన రాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే అయింది. ఆల్మోస్ట్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి 1000 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని సమాచారం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ 650 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో నిర్మాతలు మైత్రి వాళ్ళే డైరెక్ట్ గా రిలీజ్ చేస్తుంటే కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే పుష్ప సినిమా ఆల్మోస్ట్ 210 కోట్లకు థియేటరికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ లెక్కన పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 215 కోట్ల షేర్ కలెక్షన్స్.. అంటే ఆల్మోస్ట్ 430 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. ఇక పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే కనీసం 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాల్సిందే.

Also Read : Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ఏం చదువుకున్నారో తెలుసా.. అప్పట్లోనే అంత డిఫరెంట్ గా చదివి..

పుష్ప 2 సినిమా హిట్ అవ్వాలంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 500 కోట్ల గ్రాస్ తెచ్చుకోవాలి. అసలే తెలంగాణలో భారీగా టికెట్ రేట్లు పెంచారు. ఏపీలో కూడా రేపో మాపో పెంచుతారు. దీంతో ఈ కలెక్షన్స్ వస్తాయనే అంచనా వేస్తున్నారు మూవీ యూనిట్. ఇక ప్రపంచవ్యాప్తంగా హిట్ అవ్వాలంటే కనీసం 1400 కోట్ల గ్రాస్ అయినా కలెక్ట్ చేయాలి.