Bollywood : బాలీవుడ్ లో ఒకేరోజు రెండు విషాదాలు.. ప్రముఖ నటి, నటుడు కన్నుమూత..

బాలీవుడ్ లో రెండు రోజుల క్రితమే యువ నటుడు ఆదిత్య సింగ్ మరణించాడు. తాజాగా బాలీవుడ్ లో రెండు మరణాలు చోటు చేసుకున్నాయి.

Bollywood Actress vaibhavi upadhyaya and Actor Nitesh Pandey passes away

Nitesh Pandey  :  ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్(Tollywood) లో ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) కన్నుమూశారు. నిన్న RRR నటుడు రే స్టీవెన్ సన్ కూడా మరణించారు. అలాగే బాలీవుడ్ లో రెండు రోజుల క్రితమే యువ నటుడు ఆదిత్య సింగ్ మరణించాడు. తాజాగా బాలీవుడ్ లో రెండు మరణాలు చోటు చేసుకున్నాయి.

బాలీవుడ్ లో ప్రముఖ కామెడీ సీరియల్ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి వైభవి ఉపాధ్యాయ యాక్సిడెంట్ లో మరణించింది. నార్త్ లో యాక్సిడెంట్ లో మరణించగా ఆమె భౌతికకాయం నేడు ముంబైకి చేరుకోనుంది. పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన వైభవి ఉపాధ్యాయ మరణంతో బాలీవుడ్ లో విషాదం నెలకొనగా పలువురు బాలీవుడ్ టీవీ, సినీ ప్రముఖులు ఆమె మృతిపై స్పందిస్తూ ఆమెకు నివాళులు తెలియచేస్తున్నారు.

వైభవి ఉపాధ్యాయ మరణం గురించి తెలిసిన కొద్దీ గంటల్లోనే మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు నితేశ్ పాండే కన్నుమూశారు. షూటింగ్ కోసం నితేశ్ పాండే నాసిక్ దగ్గర్లోని ఇగత్‌పురికి వెళ్లగా ఇవాళ తెల్లవారుజామున హోటల్ లో హార్ట్ అటాక్ తో కన్నుమూసినట్టు సమాచారం. దీంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. దబాంగ్ 2, ఓం శాంతో ఓం, బదాయిహో.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు నితేశ్ పాండే. పలు టీవీ సీరియల్స్, సిరీస్ లలో కూడా నటించాడు. చివరిసారిగా అనుపమ అనే సిరీస్ లో మెప్పించాడు నితేశ్ పాండే.

Vaibhavi Upadhyaya : సినీ పరిశ్రమలో మరో విషాదం.. యాక్సిడెంట్ లో యువ నటి మృతి..

51 ఏళ్ళ వయసులో నితేశ్ పాండే గుండెపోటుతో మరణించాడని తెలియడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె భార్య అర్పిత పాండే కూడా టీవీ నటి. అయితే నితేశ్ పాండే హోటల్ లో సడెన్ గా చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. బాలీవుడ్ సినీ, టీవీ ప్రముఖులు నితేశ్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.