Kriti Kharbanda
Kriti Kharbanda : 2019 నుండి డేటింగ్‌లో ఉన్న పుల్కిత్ సామ్రాట్-కృతి ఖర్బందాలకు నిశ్చితార్థం అయ్యిందా? తాజాగా వీరిద్దరి ఫోటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా వీరికి నిశ్చితార్థం అయ్యిందని మాట్లాడుకుంటున్నారు.
Kriti Kharbanda
బాలీవుడ్ ప్రేమ జంట కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్ధ వేడుక వారి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఫోటోలలో కుటుంబ సభ్యులతో ఫోజులిస్తున్న పుల్కిత్ కృతికి హగ్ ఇస్తూ కనిపించారు. ఇద్దరి చేతికి ఒకేరకమైన ఉంగరాలు ఉండటం కూడా నెటిజన్ల కంట పడింది. దాంతో వీరిద్దరూ అధికారికంగా నిశ్చితార్ధం చేసుకున్నారా? అని చర్చ మొదలుపెట్టారు.
కృతి బ్లూ అండ్ గోల్డెన్ అనార్కలీలో బ్లష్ పింక్ దుపట్టాలో మెరిపోతే.. పుల్కిత్ తెల్లటి కుర్తాలో బ్లూ ప్రింట్ దుస్తులతో హ్యాండ్ సమ్‌గా ఉన్నారు. బ్యాగ్రౌండ్‌లో ఇల్లంతా అలంకరించబడి ఉంది. కుటుంబ సభ్యులంతా వేడుక కోసం ఒక చోట చేరినట్లు అనిపించింది. అయితే పుల్కిత్ సామ్రాట్ కానీ, కృతి ఖర్బందా కానీ అధికారికంగా తమకు నిశ్చితార్ధం జరిగినట్లు ఇంకా ప్రకటించలేదు. గతంలో పుల్కిత్‌కి శ్వేతా రోహిరాతో పెళ్లైంది. పెళ్లైన సంవత్సరం 2015 లోనే వీరు విడిపోయారు. కృతి మరియు పుల్కిత్ వీరే కి వెడ్డింగ్, తైష్ మరియు పగల్‌పంతి వంటి అనేక ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేశారు. కృతి తెలుగులో అలా మొదలైంది, తీన్ మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్ లీ వంటి సినిమాల్లో మెరిశారు.