Minugurulu : ఇంటర్నేషనల్ వైడ్ ఎన్నో అవార్డులు.. ‘మిణుగురులు’ సినిమాకి పదేళ్లు.. అమెరికాలో స్పెషల్ షో..

మిణుగురులు లాంటి మంచి ఎమోషనల్ సోషల్ మెసేజ్ సినిమా రిలీజయి ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేశారు.

Minugurulu : ఇంటర్నేషనల్ వైడ్ ఎన్నో అవార్డులు.. ‘మిణుగురులు’ సినిమాకి పదేళ్లు.. అమెరికాలో స్పెషల్ షో..

Ayodhya Kumar Krishnamsetty Minugurulu Movie Completed 10 Years Special Show in America

Updated On : January 30, 2024 / 2:39 PM IST

Minugurulu : అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014లో వచ్చిన సోషల్ మెసేజ్ సినిమా ‘మిణుగురులు’. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్, దీపక్ సరోజ్, శ్రీనివాస సాయి.. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మిణుగురులు అప్పట్లో మంచి విజయం సాధించింది.

అప్పట్లోనే ‘మిణుగురులు’ సినిమా 18వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ‘గోల్డెన్ ఎలిఫెంట్’ అవార్డు, 9వ బెంగళూరు అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సినిమాగా అవార్డు గెలుచుకుంది. 2014లో ‘అస్కార్స్’ కి ఉత్తమ చిత్ర జాబితాకి వెళ్లిన సినిమాల్లో ‘మిణుగురులు’ కూడా ఉంది. ఆస్కార్ లైబ్రరీ పర్మనెంట్ సినిమాలో కూడా ‘మిణుగురులు’ నిలిచింది. 2014లో ఏకంగా 7 నంది అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా.

మిణుగురులు లాంటి మంచి ఎమోషనల్ సోషల్ మెసేజ్ సినిమా రిలీజయి ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేశారు. అప్పట్లో ఈ సినిమాకి అవార్డులు మాత్రమే కాక ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖుల అభినందనలు కూడా దక్కాయి. అమెరికాలో స్పెషల్ షో అనంతరం దర్శకుడు కృష్ణంశెట్టి మాట్లాడుతూ.. 2014లో ఈ సినిమా రిలీజయినప్పుడు సోషల్ మీడియా పెద్దగా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజయి ఉంటే ఇంటర్నేషనల్ వైడ్ వైరల్ అయ్యేది. ఈ సినిమా అప్పట్లో నిజంగా చూపు లేని వారి గురించి తెలుసుకొని, పరిశోధించి తీశాను. ఈ సినిమా రిలీజయి పదేళ్లు అయినా ఇంకా మాట్లాడుకుంటున్నారు అని ఆనందం వ్యక్తం చేశారు.

Ayodhya Kumar Krishnamsetty Minugurulu Movie Completed 10 Years Special Show in America

Also Read : Theatrical Movies : బాబోయ్.. ఏకంగా పది చిన్న సినిమాలు రిలీజ్.. ఈ వారం థియేటర్లో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే..

ఇక మిణుగురులు డైరెక్టర్ అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి అమెరికాలోనే ఫిలిం మేకింగ్ నేర్చుకున్నారు. మిణుగురులు మాత్రమే కాక పలు షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంట్స్ తీసి అవార్డులు గెలుచుకున్నారు. 2018లో హెబా పటేల్, అరుణ్ జంటగా నటించిన 24 కిస్సెస్ సినిమా తీసింది కూడా ఈయనే.

Ayodhya Kumar Krishnamsetty Minugurulu Movie Completed 10 Years Special Show in America