Theatrical Movies : బాబోయ్.. ఏకంగా పది చిన్న సినిమాలు రిలీజ్.. ఈ వారం థియేటర్లో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే..
ఈ వారం ఒకేసారి దాదాపు 10 చిన్న సినిమాలు థియేటర్స్ లో రాబోతున్నాయి.

February first Week Theatrical Releasing Telugu Movies Full List
Theatrical Movies : సంక్రాంతి సినిమాల సందడి థియేటర్స్ లో ఇంకా నడుస్తుంది. ఇటీవల రిపబ్లిక్ డేకి కూడా ఓ డబ్బింగ్ సినిమా, ఓ హిందీ సినిమా వచ్చినా అవి తెలుగులో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్స్ లో హవా చూపిస్తున్నాయి. ఈ వారం ఒకేసారి దాదాపు 10 చిన్న సినిమాలు థియేటర్స్ లో రాబోతున్నాయి. మళ్ళీ వచ్చేవారం నుంచి పెద్ద, మీడియం సినిమాలు ఉండటంతో ఇదే మంచి టైం అనుకోని చిన్న సినిమాలన్నీ ఒకేసారి కట్టకట్టుకుని వచ్చేస్తున్నాయి. అది కూడా అన్ని సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం రిలీజయ్యే సినిమాలన్నీ కూడా ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్నాయి.
ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదన్నా ఉందంటే అంబాజీపేట మ్యారేజీబ్యాండ్ ఒక్కటే. సుహాస్(Suhas), శివాని జంటగా దుశ్యంత్ దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండ్’ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సుహాస్ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం, ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ మెప్పించడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.
బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సోహెల్(Sohel) హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన సినిమా ‘బూట్‌కట్ బాలరాజు’. మేఘలేఖ హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, ఇంద్రజ, అవినాష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది.
గీతానంద్, నేహా సోలంకి(Neha Solanki) జంటగా దయానంద్ దర్శకత్వంలో కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా గేమ్ ఆన్. సైకాలజీ గేమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ ఎక్కువే ఉన్నట్టు ట్రైలర్స్ చూస్తే అర్ధమవుతుంది.
లక్ష్ చదలవాడ హీరోగా నేహా పఠాన్, సోనియా బన్సాల్ హీరోయిన్స్ గా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మాణంలో విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధీర’ సినిమా ఫిబ్రవరి 2న రానుంది.
Also Read : Sreenivasa Kumar (SKN) : బేబీ కలెక్షన్స్ 100 కోట్ల గురించి నిర్మాత SKN ఏం చెప్పాడంటే?
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ నిర్మాణంలో కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కిస్మత్’ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది.
యష్ పూరి, అపూర్వ రావ్ జంటగా హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ నిర్మాణంలో కౌశిక్ భీమిడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది.
వీటితో పాటు మెకానిక్, చిక్లెట్స్, ఉర్వి, శంకర.. లాంటి పలు చిన్న సినిమాలు కూడా ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతున్నాయి.