Sreenivasa Kumar (SKN) : బేబీ కలెక్షన్స్ 100 కోట్ల గురించి నిర్మాత SKN ఏం చెప్పాడంటే?

తాజాగా బేబీ కలెక్షన్స గురించి మాట్లాడారు నిర్మాత SKN.. 'ట్రూ లవర్' టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Sreenivasa Kumar (SKN) : బేబీ కలెక్షన్స్ 100 కోట్ల గురించి నిర్మాత SKN ఏం చెప్పాడంటే?

Sreenivasa Kumar (SKN)

Updated On : January 30, 2024 / 2:18 PM IST

Sreenivasa Kumar (SKN) : నిర్మాత SKN , డైరెక్టర్ మారుతి తమిళ సినిమా ‘ట్రూ లవర్’ ను తెలుగులోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంలో బేబీ కలెక్షన్స్ పై SKN చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Pushpa 2 : చీరలో అల్లు అర్జున్.. ‘పుష్ప 2’ షూటింగ్ నుంచి ఫోటో లీక్..

2023లో వచ్చిన ‘బేబీ’ మూవీ  నిర్మాత SKN-దర్శకుడు సాయి రాజేష్‌కు బేబీ సినిమా పెద్ద విజయాన్ని అందించింది. ఆనంద్ కొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌లకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. విడుదలైన 11 రోజుల్లో రూ.70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ వంద కోట్ల గ్రాస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వంద కోట్ల గ్రాస్ అంటే అందులో కనీసం రూ.45 కోట్ల షేర్ వచ్చి ఉంటుంది. ఈ సినిమా లెక్కలపై తాజాగా నిర్మాత SKN మాట్లారు. మారుతి-SKN కలిసి తీస్తున్న ‘ట్రూ లవర్’ టీజర్ లాంచ్‌లో ఆయన స్పందించారు.

Neha Solanki : బ్లాక్ శారీలో హాట్ పోజులతో నేహా సోలంకి.. గేమ్ ఆన్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

బేబీ వంద కోట్లు కలెక్ట్ చేసింది కదా ఏం చేసారు? అంటూ SKN ను మీడియా అడిగిన ప్రశ్నకు ‘నాతో కమిట్ చేయించి లేని పోని టాక్స్‌లు కట్టించేలా ఉన్నారు..’ అంటూ SKN నవ్వుతూ మాట్లాడారు. బేబీ కలెక్షన్స్ ఫిగరు పోస్టర్ల మీదనే ఉందని తన అకౌంట్‌కి ఇంకా రాలేదని.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుండి ఇంకా రావాల్సి ఉందని అన్నారు SKN. సలార్ అయ్యాక.. గుంటూరు కారం అయ్యాక వస్తాయని చెబుతున్నారని.. అయితే రావాల్సిన అమౌంట్ గ్రాసే.. అందులో షేర్ వేరే ఉంటుందని.. ఐస్ ముక్కలా అది చేతులు మారి వచ్చేసరికి  ఎంతో ఉండదని  SKN  చెప్పారు. ‘ఆ ముక్క కోసం వెయిట్ చేస్తున్నాం’ అంటూ పక్కనే ఉన్న డైరెక్టర్ మారుతి స్పందించగానే అందరూ నవ్వేసారు. అవి వచ్చేలోపు బేబీ బాలీవుడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు SKN.