Pushpa 2 : చీరలో అల్లు అర్జున్.. ‘పుష్ప 2’ షూటింగ్ నుంచి ఫోటో లీక్..
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూట్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది.

Allu Arjun Pushpa 2 Movie Shooting Pic Leaked Photo goes Viral
Pushpa 2 Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. పాటలు, డైలాగ్స్ తో తగ్గేదేలే అంటూ వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాడు పుష్ప. తన నటనతో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చాడు బన్నీ. దీంతో అల్లు అర్జున్ హవా మరింత పెరిగింది. పుష్ప 2 సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
పుష్ప పార్ట్ 1 వచ్చి మూడేళ్లు అవుతుంది. దీంతో పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 ఈ సినిమా రిలీజ్ అవుతుందని గతంలోనే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఆల్రెడీ పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అంచనాలు మరిన్ని పెంచారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది.
Also Read : Anupama Parameswaran : మెడలో తాళి చూపిస్తూ అనుపమ పరమేశ్వరన్ ఫొటోలు.. షాక్ అవుతున్న అభిమానులు..
తాజాగా ఈ సినిమా షూట్ నుంచి ఓ ఫోటో లీక్ అయింది. అల్లు అర్జున్ చీర కట్టుకొని కూర్చున్న ఫోటో ఒకటి పుష్ప సెట్స్ నుంచి లీక్ అయి వైరల్ అవుతుంది. తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ ఉండనున్నాయి. ఆల్రెడీ ఆ జాతరకు రెడీ అయ్యేలాగా గతంలోనే అల్లు అర్జున్ కి చీర కట్టి అమ్మవారిలా ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు లీక్ అయిన ఫొటోలో అల్లు అర్జున్ అదే గెటప్ లో రెడీ అవుతున్నట్టు ఉంది. తిరుపతి గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ లో ఓ ఫైట్, ఓ సాంగ్ ఉందని సమాచారం. దీంతో పుష్ప 2 లీక్ ఫోటో వైరల్ గా మారింది.