Shah Rukh Khan : ‘బాత్రూంలో కూర్చొని ఏడ్చిన షారుఖ్’ .. అసలేం జరిగిందంటే..?
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో నంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ ఇప్పటికే హిందీలో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

Bollywood Baadshah Shahrukh Khan about his bad phase of life
Shah Rukh Khan : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో నంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు షారుఖ్ ఖాన్. అయితే పఠాన్ సినిమా కంటే ముందు వరకు షారుఖ్ కి హిందీలో సరైన హిట్ లేదు. పలు సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత పఠాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
పఠాన్ తర్వాత వచ్చిన జవాన్, డంకీ సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. కాగా ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ వేడుకలో షారుఖ్ తన కెరీర్లో బ్యాడ్ ఫేజ్ గురించి మాట్లాడుతూ.. “ప్లాప్స్ వస్తే ఎవరన్నా కృంగిపోవడం సహజం.. నేను కూడా చాలా బాధ పడ్డా. కానీ ఎప్పుడు నా ఫెయిల్యూర్లకు ఎవరినీ నిందించలేదని అన్నారు. నా కెరీర్ గురించి ఎవరినో నిందించడం నాకు ఇష్టముండదు, అది కరెక్ట్ కాదు. నేను బాత్ రూమ్స్ లో ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను బాధ పడుతుంది ఎవరి ముందు చూపించను. నా బాధను నేను దిగమింగుకోగలను. మనకు వ్యతిరేకంగా ఈ ప్రపంచం ఉందని అనుకోకూడదు. ప్రపంచం మనకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండదు. కొన్నిసార్లు మన తప్పులేకపోయినా ఫెయిల్యూర్లు ఎదురవుతాయి. దానికి ఎన్నో కారణాలు ఉంటాయంటూ తెలిపాడు షారుఖ్.
Also Read : Mangli : అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ మంగ్లీ.. స్టైలిష్ ఫొటోలు..
అంతేకాకుండా.. ఎల్లప్పుడూ నోరు మూసుకొని మన పని మనం చేసుకోవాలని. మన ఫెయిల్యూర్ కి ఎవరినో నిందించడం కరెక్ట్ కాదని, తన ఫెయిల్యూర్ ఫేజ్ గురించి గుర్తుచేసుకుంటూ మాట్లాడారు షారుఖ్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రసుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో ఒకే ఏడాది మూడు వేల కోట్ల వసూళ్లు రాబట్టిన హీరోగా కూడా రికార్డు బ్రేక్ చేసాడు షారుఖ్.