Bollywood : 2024లో బాలీవుడ్‌‌లో వచ్చే పెద్ద చిత్రాలు ఇవే.. వీటిలో సౌత్‌లో కూడా రిలీజయ్యే..

ఈ ఇయర్ బాలీవుడ్ లో రాబోయే బడా సినిమాలు ఏంటి..? వాటిలో సౌత్ లో కూడా రిలీజ్ కాబోయే చిత్రాలు ఏంటి..? అనే విషయాలు పై ఓ లుక్ వేసేయండి.

Bollywood big movie releases in 2024 hindi and telugu languages

Bollywood : గత ఏడాది 2023లో బాలీవుడ్ నుంచి వచ్చిన పఠాన్, జవాన్, యానిమల్ వంటి కొన్ని బడా సినిమాలు పెద్ద విజయాలనే సొంతం చేసుకున్నాయి. మరి ఈ ఇయర్ బాలీవుడ్ లో రాబోయే బడా సినిమాలు ఏంటి..? వాటిలో సౌత్ లో కూడా రిలీజ్ కాబోయే చిత్రాలు ఏంటి..? అనే విషయాలు పై ఓ లుక్ వేసేయండి.

సింగం ఎగైన్..
బాలీవుడ్ కాప్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సినిమా ‘సింగం ఎగైన్’. ఇప్పటికే ఈ యూనివర్స్ లో సింగం1, సింగం2, సింబా, సూర్యవంశీ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ చిత్రాలు అన్ని మంచి విజయాలనే అందుకున్నాయి. దీంతో ఇప్పుడు సింగం ఎగైన్ పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ తో పాటు సింబాగా రణవీర్, లేడీ సింగంగా దీపికా పదుకొనె కనిపించబోతున్నారు. ఈ చిత్రం కేవలం హిందీలోనే రిలీజ్ కాబోతుందని చెబుతున్నారు.

ఫైటర్..
బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ మూవీని జనవరి 25న రిలీజ్ చేయబోతున్నారు. గతంలో సిద్దార్థ్ ఆనంద్, హృతిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈక్రమంలోనే ఫైటర్ ని కూడా తెలుగు రిలీజ్ చేయనున్నారు.

బడే మియాన్ చోటే మియాన్..
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’. ఈ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది. కేవలం హిందీలో మాత్రమే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Also read : Yatra 2 : యాత్ర 2 టీజర్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడంటే..?

జిగ్రా..
పెళ్లి తరువాత కొంచెం బ్రేక్ తీసుకున్న అలియా భట్.. ‘జిగ్రా’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. సోదరుడి కోసం పోరాడే ఓ సోదరి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆర్ఆర్ఆర్, బ్రహ్మస్త్రతో తెలుగులో కూడా అలియా మంచి ఫేమ్ ని సంపాదించుకోవడంతో.. ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు.

వెల్‌కమ్ టు ది జంగిల్..
అక్షయ్ కుమార్ ఈ ఏడాది రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ అనే అడ్వెంచర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఈ ఏడాదే రాబోతుంది. ఇది హిందీలో మాత్రమే రిలీజ్ కానుంది

ది క్రూ, దో పట్టి..
టబు, కరీన్ కపూర్, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ది క్రూ’, కాజోల్ మెయిన్ లీడ్ లో రూపొందుతున్న ‘దో పట్టి’ సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. ఆడియన్స్ లో ఈ సినిమాలు పై కూడా మంచి క్రేజ్ ఉంది. ఇవి హిందీలోనే రిలీజ్ కాబోతుంది.

బయోపిక్స్..
దివంగత ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయిగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్న బయోపిక్‌ (Main Atal Hoon), ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్న ‘ది ఎమర్జెన్సీ’ బయోపిక్.. ఈ ఏడాదే రిలీజ్ కాబోతుంది. ఈ రెండిటిలో ది ఎమర్జెన్సీ మాత్రమే తెలుగులో రిలీజ్ కానుందని తెలుస్తుంది.