Bollywood Critic “KRK”: ఇక రివ్యూలు రాయనంటున్న క్రిటిక్..

బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ KRK.. సినిమా విశ్లేషకుడు గానే కాకుండా సినీ నిర్మాతగా, రచయితగా, నటుడి గాను పని చేశాడు. వివాదాస్పద రివ్యూలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రిటిక్ హీరోగా నటించిన ఒకేఒక చిత్రం 'దేశద్రోహి', అది కూడా వివాదాస్పదం గానే నిలిచింది అనుకోండి.

Bollywood Critic “KRK”: ఇక రివ్యూలు రాయనంటున్న క్రిటిక్..

Bollywood Critic KRK Wants to Stop Reviews

Updated On : September 25, 2022 / 11:13 AM IST

Bollywood Critic “KRK”: బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ KRK.. సినిమా విశ్లేషకుడు గానే కాకుండా సినీ నిర్మాతగా, రచయితగా, నటుడి గాను పని చేశాడు. వివాదాస్పద రివ్యూలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రిటిక్ హీరోగా నటించిన ఒకేఒక చిత్రం ‘దేశద్రోహి’, అది కూడా వివాదాస్పదం గానే నిలిచింది అనుకోండి.

#Boycott VikramVeda : నీ పని నువ్వు చూసుకో.. నీ సినిమా కూడా బాయ్ కాట్ చేస్తాం.. హృతిక్ కి నెటిజన్లు వార్నింగ్..

ఇప్పుడు ఈ సినిమా విమర్శకుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై రివ్యూలు చెప్పబోనంటూ వెల్లడించాడు. తాను చివరిగా రివ్యూ ఇవ్వబోయేది బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన తమిళ రీమేక్ మూవీ ‘విక్రమ్ వేద’నే అంటూ ప్రకటించాడు.

గతంలో దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ను కూడా.. “చెత్త సినిమా అంటూ, రాజమౌళిని జైల్లో పెట్టాలని” తనదైన శైలిలో విమర్శించిన ఈ క్రిటిక్. ఇటీవల జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. తప్పుడు రివ్యూలు ఇస్తున్నాడనే ఆరోపణలతో సంకెళ్లు లెక్కబెట్టిన ‘KRK’కి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.