Rajkumar Kohli
Rajkumar Kohli : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ కోహ్లీ గుండెపోటుతో మరణించారు. ముంబయిలోని ఆయన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.
Animal : ‘యానిమల్’కి సీక్వెల్ ఉందా..? అన్‌స్టాపబుల్ షోలో సందీవ్ వంగా ఏం చెప్పారు..?
నటుడు అర్మాన్ కోహ్లీ తండ్రి ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ కోహ్లీ (90) కన్నుమూశారు. ఉదయం స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లిన ఆయన బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన పడ్డారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి ఆయన విగతజీవిగా పడి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
1966 లో దుల్లా బట్టి, 1970 లో దారా సింగ్ నటించిన లూటేరా, నాగిన్, జానీ దుష్మన్, బద్లే కి ఆగ్, నౌకర్ బీవీ కా, రాజ్ తిలక్ వంటి సినిమాలను రాజ్‌కుమార్ కోహ్లీ డైరెక్ట్ చేసారు. సన్నీ డియోల్, మిథున్ చక్రవర్తి, అనిల్ కపూర్, సునీల్ దత్, ధర్మేంద్ర, జితేంద్ర, శత్రుఘ్ను సిన్హా, రీనా రాయ్, అనితా రాజ్ వంటి వంటి నటీనటులు ఆయన సినిమాల్లో నటించారు.
Actor Prudhvi : స్టార్ హీరో కొడుకుతో కమెడియన్ ఫృథ్వీ రాజ్ కుమార్తె పెళ్లి?
1970 నుండి 2003 వరకు పలు హిందీ పంజాబీ సినిమాలను డైరెక్ట్ చేశారు రాజ్‌కుమార్ కోహ్లీ. రాజ్ కుమార్ కుమారుడు అర్మాన్ కోహ్లీ 1992 లో తండ్రి డైరెక్షన్‌లో విరోధితో అరంగేట్రం చేసారు. రాజ్‌కుమార్ కోహ్లీ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.