Bollywood Director Sanoj Mishra Arrested who gave Movie Chance to Kumbh Mela Viral Girl Monalisa
Sanoj Mishra : కుంభమేళా సమయంలో మోనాలిసా అనే ఓ అమ్మాయి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే ఓ అమ్మాయి నీలి కళ్ళతో అందంగా కనిపించడంతో అందరూ ఆమెని వీడియోలు తీసి వైరల్ చేసారు. దీంతో సనోజ్ మిశ్రా అనే బాలీవుడ్ డైరెక్టర్ మోనాలిసాకు వచ్చిన క్రేజ్ చూసి తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు.
మోనాలిసా హీరోయిన్ గా ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాని ప్రకటించి షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. అయితే నేడు సనోజ్ మిశ్రాని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. మనోజ్ మిశ్రా ఓ నటిగా అవకాశాల కోసం తిరుగుతున్న ఓ అమ్మాయిని అవకాశాలు ఇస్తానని ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేసాడని కేసు నమోదయిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Also See : Rohith Nara : ఉగాది నాడు భార్యతో నారా రోహిత్ క్యూట్ ఫొటోలు..
ఈ కేసులో సనోజ్ మిశ్రా బెయిల్ పిటిషన్ ని ఢిల్లీ హై కోర్ట్ రిజెక్ట్ చేసింది. దీంతో పోలీసులు నేడు సనోజ్ మిశ్రాని అదుపులోకి తీసుకున్నారు. మరి దీనిపై మోనాలిసా కానీ సనోజ్ మిశ్రా తరపు వ్యక్తులు కానీ స్పందిస్తారేమో చూడాలి. సనోజ్ మిశ్రా బాలీవుడ్ లో దాదాపు ఓ పది చెప్పుకోదగ్గ సినిమాలే డైరెక్ట్ చేసాడు.