The Vaccine War : ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ రిలీజ్.. కరోనా పై భారత్ పోరాటం..

వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న 'ది వ్యాక్సిన్ వార్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Bollywood director Vivek Agnihotri The Vaccine War trailer release

The Vaccine War : తాశ్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్న దర్శకుడు ‘వివేక్ రంజన్ అగ్నిహోత్రి’. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ మూవీతో 300 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని ఇండియన్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించాడు. ఈ మూవీ విషయంలో ప్రశంసలతో పాటు అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ చిత్రం తరువాత డైరెక్టర్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న మూవీ ‘ది వ్యాక్సిన్ వార్’. ఈసారి ఈ మూవీ అనౌన్స్‌మెంట్ తోనే దర్శకుడు సంచలనం సృష్టించాడు.

Mark Antony : మళ్ళీ పుట్టిన ‘సిల్క్ స్మిత’.. మార్క్ ఆంటోని చిత్రంతో ఎంట్రీ..

కరోనా వచ్చిన సమయంలో మొత్తం ప్రపంచం ఎదురుకున్న సమస్యలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇక ఆ సమస్య నుంచి బయటపడేందుకు భారత్ చేసిన పోరాటం.. వ్యాక్సిన్ కనుకోగడం. ఈమద్యలో భారత్ సైంటిస్ట్ లు ఎదురుకున్న సవాళ్లు అన్నిటిని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ మొత్తం క్యూరియాసిటీతో ముందుకు సాగింది. ట్రూ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూపించారు. నానా పాటేకర్, పల్లవి జోషి, రైమా సేన్, సప్తమి గౌడ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

Mammootty : మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం.. తల్లి దూరమైన కొన్నాళ్లకే..

సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఆ తేదిలోనే తెలుగు, తమిళంలో పలు బడా సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాణించగలదా..? గతంలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో బాక్స్ ఆఫీస్ వద్దకి వచ్చిన కశ్మీర్ ఫైల్స్.. ఆడియన్స్ ని ఆకట్టుకొని సూపర్ హిట్ దశగా వెళ్ళింది. మరి వ్యాక్సిన్ వార్ కూడా అదే మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.