Mark Antony : మళ్ళీ పుట్టిన ‘సిల్క్ స్మిత’.. మార్క్ ఆంటోని చిత్రంతో ఎంట్రీ..

విశాల్ నటిస్తున్న కొత్త మూవీ 'మార్క్ ఆంటోని' సిల్క్ స్మిత కూడా కనిపించబోతుంది. ఆ అమ్మాయి ఎవరు..?

Mark Antony : మళ్ళీ పుట్టిన ‘సిల్క్ స్మిత’.. మార్క్ ఆంటోని చిత్రంతో ఎంట్రీ..

Gandhi Vishnu Priya as Silk Smitha in Vishal Mark Antony

Updated On : September 12, 2023 / 4:01 PM IST

Mark Antony : తమిళ హీరో విశాల్ (Vishal) నటిస్తున్న కొత్త మూవీ ‘మార్క్ ఆంటోని’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ ట్రైలర్ లోని ఒక విషయం అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించింది. ట్రైలర్ లో అలనాటి నటి ‘సిల్క్ స్మిత’ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Mark Antony : కోర్టులో విశాల్‌కి క్లియరెన్స్.. సెప్టెంబర్ 15నే ‘మార్క్ ఆంటోని’ విడుదల.. హిందీలో మాత్రం..

అసలు సిల్క్ స్మితని మూవీలో ఎలా చూపించారు అని అందరూ తెగ అరా తీసేస్తున్నారు. ఇంతకీ మూవీలో సిల్క్ ని చూపించడానికి ఏమన్నా టెక్నాలజీ ఉపయోగించారా..? లేదా ఇంకేమన్నా టెక్నిక్స్ యూజ్ చేశారా..? అసలు విషయం ఏంటంటే.. మూవీలో సిల్క్ స్మితని చూపించడానికి ఎటువంటి టెక్నాలజీ వాడలేదు. సిల్క్ పోలికలతో ఉన్న ఒక అమ్మాయిని తీసుకు వచ్చి ఆ పాత్రని చేయించారు. ‘గాంధీ విష్ణు ప్రియ’ అనే ఒక అమ్మాయి చూడడానికి సిల్క్ లాగానే కనిపిస్తుంది.

Chris Evans : సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్న కెప్టెన్ అమెరికా.. ఐరన్ మ్యాన్ అతిథిగా..

ఆమె తన సోషల్ మీడియాలో సిల్క్ స్మితలా కనిపించే వీడియోలు చేసి షేర్ చేస్తూ వచ్చేది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య పలు యూట్యూబ్ ఛానల్స్ కి కూడా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈ వీడియోలు మార్క్ ఆంటోని దర్శకుడు కూడా చూశాడు అనుకుంటా. ఇక మూవీలో గాంధీ విష్ణు ప్రియని సిల్క్ లా చూపించేందుకు.. ఆమెలా మేకప్ వేశారు. ఫలితంగా స్క్రీన్ పై అచ్చం సిల్క్ స్మితని చూసిన ఫీలింగ్ ని అభిమానులకు ఇస్తుంది. మూవీలో సిల్క్ స్మిత అండ్ ఎస్ జె సూర్య మధ్య ఒక సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Krishnaveni Babu (@bavibabu_mua)