Bollywood Drugs Case: హైకోర్టును ఆశ్రయించిన రకుల్..

  • Publish Date - September 17, 2020 / 12:53 PM IST

Rakul Preet Singh approaches Delhi High Court: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో తనకు వ్యతిరేకంగా వస్తున్న మీడియా కథనాలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్రయించింది.

డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. సారా అలీఖాన్, రకుత్ ప్రీత్ సింగ్ పేర్లను వెల్లడించిందంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డ్రగ్స్ కేసులో రకుల్ పేరును ప్రస్తావిస్తూ మీడియాలో విపరీతంగా కథనాలు ప్రసారమవుతున్నాయి.


డ్రగ్స్ కేసులో రకుల్‌కు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తలను ఆపాలని ‘ఐ అండ్ బి’ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతూ రకుల్ తరపు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను స్వీకరించిన జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
https://10tv.in/ar-rahman-gets-notice-from-madras-hc-for-evading-income-tax-on-rs-3-47-crore/
మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని గతంలోనే సుప్రీం సూచించిందని ధర్మాసనం పేర్కొంది. స్వీయ నియంత్రణ పాటించాలంటూ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. సమాచార ప్రసారాల శాఖ, ప్రసార భారతి, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసింది.


రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి సంబంధిత ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు సూచించింది. కాగా డ్రగ్స్ కేసులో తాము సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఎటువంటి సమన్లు జారీ చేయలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు