Akshay Kumar : అక్షయ్ కుమార్ రోబో బ్యాగ్.. వైరల్ అవుతున్న వీడియో!
సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్న అక్షయ్ కుమార్.. తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అయితే అక్షయ్ కుమార్ తగిలించుకున్న రోబో బ్యాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

Bollywood Hero Akshay Kumar robo bag video gone viral OMG2
Akshay Kumar Bag : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవల సెల్ఫీ (Selfiee) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మలయాళ హిట్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’కి ఇది రీమేక్ గా వచ్చింది. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో రెండు సీక్వెల్స్ అయితే, ఒకటి రీమేక్ సినిమా.
Naatu Naatu : ‘నాటు నాటు’తో యుక్రెయిన్ నిరసన.. సైనికుల రీ క్రియేట్ వీడియో వైరల్!
గతంలో అక్షయ్ నటించిన సూపర్ హిట్ మూవీస్ OMG, ఫిర్ హేరా ఫేరీ సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ తీసుకు వస్తున్నాడు. OMG-2 షూటింగ్ ఆల్రెడీ పూర్తి అయ్యిపోయింది. ఫిర్ హేరా ఫేరీ షూటింగ్ మొదలు అయ్యినట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న అక్షయ్.. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అయితే అక్షయ్ కుమార్ తగిలించుకున్న రోబో బ్యాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. కళ్ళు మూస్తూ, తెరుస్తూ కనిపించిన బ్లాక్ రోబో బ్యాగ్ టాక్ అఫ్ ది టౌన్ అయ్యిపోయింది.
NTR : ‘దేవర’ షూట్ కి బ్రేక్.. ఎన్టీఆర్ వెకేషన్ ఎన్ని రోజులో?
కాగా అక్షయ్ కుమార్ సూర్యవంశీ నుంచి మరో హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పటి వరకు వరుసగా 8 ప్లాప్ లు అందుకున్నాడు. అయితే అక్షయ్ ఇలా ప్లాప్ లు అందుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో వరసగా 16 ప్లాప్ లు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ప్లాప్ లు నుంచి అక్షయ్ బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఆ మూవీతో అక్షయ్ తప్పకుండ హిట్ అందుకుంటాడు అంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram