Varun Dhawan : తండ్రి కాబోతున్న బాలీవుడ్ హీరో.. ఫోటో వైరల్..
తండ్రి కాబోతున్న బాలీవుడ్ హీరో. మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. మాకు మీ అందరి ప్రేమ, అశీసులు కావాలంటూ ఫోటో షేర్ చేసారు.

Bollywood Hero Varun Dhawan becoming daddy soon
Varun Dhawan : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ త్వరలో నాన్న అని పిలిపించుకోబోతున్నారు. తనకి ఎప్పటినుంచో పరిచయం గర్ల్ ఫ్రెండ్ మరియు ఫ్యాషన్ డిజైనర్ అయిన ‘నటాషా దలాల్’ని 2021 జనవరిలో వరుణ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన మూడేళ్ళ తరువాత ఈ ఇద్దరు దంపతులు.. తమ లైఫ్ లోకి మొదటి బేబీకి వెల్కమ్ పలుకుతున్నారు. ఇక ఈ శుభవార్తని తెలియజేస్తూ వరుణ్ సోషల్ మీడియాలో పోస్టు వేశారు.
నటాషా బేబీ బంప్ కి వరుణ్ ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేస్తూ.. “మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. మాకు మీ అందరి ప్రేమ, అశీసులు కావాలి” అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టు పై బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా రియాక్ట్ అవుతూ వచ్చారు. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అర్జున్ కపూర్, అలియా భట్, సమంత, కియారా అద్వానీ, బిపాసా.. ఇలా స్టార్స్ అంతా వరుస కామెంట్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు.
Also read : Mahesh Babu : బాబాయ్ పాటకి కూతురు డాన్స్ అదుర్స్.. అక్క వీడియోపై చెల్లి సితార కామెంట్స్..
View this post on Instagram
ఇక వరుణ్ ప్రొఫిషినల్ కెరీర్ విషయానికి వస్తే.. ‘తోడేలు’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయం అయ్యారు. త్వరలో సిటాడెల్ వెబ్ సిరీస్ తో మరోసారి తెలుగువారిని పలకరించబోతున్నారు. సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సిటాడెల్ సిరీస్.. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.
అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా రూపొందుతున్న ఈ సిరీస్ హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సిరీస్ ఫస్ట్ సీజన్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇండియన్ వెర్షన్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇండియన్ ఆడియన్స్ కోసం ఇక్కడి కథలకు తగ్గట్టు రాజ్ అండ్ డీకే ఈ సినిమాని డైరెక్ట్ చేసారు.