Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మూడో సినిమా “పుష్ప”. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 6న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తెలుగులోనే కాక వేరే భాషలో కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.
Akhanda : ‘అఖండ’ సినిమాలో కనిపించిన ఎద్దుల గురించి తెలుసా ??
ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా కోసం బాలీవుడ్ లో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో, జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ ‘పుష్ప’ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని ట్వీట్ చేశాడు. రితేష్ దేశ్ ముఖ్. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘పుష్ప’ టీజర్ ని పోస్ట్ చేసి… అల్లు అర్జున్ ఇందులో ఇన్ క్రెడిబుల్ గా కనిపిస్తున్నాడని, రేపు రానున్న ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాని తెలిపాడు. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలే ఉన్నట్టు అర్ధమవుతుంది.
The incredible @alluarjun in his powerful avatar…..Excited to watch #Pushahindi trailer tom pic.twitter.com/RzEoAR42P1
— Riteish Deshmukh (@Riteishd) December 5, 2021