Bollywood heroine Deepika Padukone once again makes controversial comments
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఉండగా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికా పదుకొనె కండీషన్స్ పెట్టడం వల్ల కల్కి, స్పిరిట్ లాంటి రెండు భారీ ప్రాజెక్టుల నుంచి ఆమెను తొలగించారు(Deepika Padukone). ఈ రెండు ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. దీంతో, ఆమె పేరు కాస్త ఒక్కసారిగా ఇండియా సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ నడించింది.
ఇప్పుడు తాజాగా మరోసారి ఈ విషయం స్పందించింది దీపికా. ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “‘ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే విషయాలను అంగీకరించలేను. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఎన్నోఏళ్లుగా 8 గంటలు పని చేస్తున్నారు. ఇదేం కొత్త కాదు, రహస్యం అంతకన్నా కాదు. కానీ, ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. వాళ్ల పేర్లు కూడా నేను చెప్పాలనుకోవడం లేదు. కొంతమంది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్స్ చేస్తారు. నాకు ఇదేమి కొత్త కాదు. చాలాసార్లు ఎదుర్కొన్నాను.
నేనెప్పుడూ దేనిపైనా ఓపెన్ గా స్పందించను. నిశ్శబ్దంగా యుద్ధం చేయడమే నాకు తెలుసు. అలా చేస్తేనే అది గౌరవం అనిపించుకుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది దీపికా. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, అంతా సైలెంట్ అయింది అనుకున్న వేళ ఇప్పుడు మరోసారి దీపికా ఈ కామెంట్స్ చేయడం ఏంటా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి దీపికా చేసిన ఈ కామెంట్స్ పై కల్కి సినిమా మేకర్స్, స్పిరిట్ సినిమా మేకర్స్ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.