Bollywood producer Madhu Mantena Second Wedding with Yoga Trainer Ira Trivedi
Madhu Mantena Wedding : ఆర్జీవీ(RGV) బామ్మర్ది, బాలీవుడ్(Bollywood) నిర్మాత మధు మంతెన ఆదివారం రాత్రి ప్రముఖ యోగా ట్రైనర్(Yoga Trainer) ఐరా త్రివేది(Ira Trivedi)ని రెండో వివాహం చేసుకున్నారు. రెండో వివాహం అయినా ఈ పెళ్లిని ముంబైలో ఘనంగా చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు విచ్చేశారు. అల్లు అర్జున్(Allu Arjun) కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు.
మధు మంతెన హిందీలో అమీర్ ఖాన్ గజినీ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత క్వీన్, లూటేరా, ఉడ్తా పంజాబ్, సూపర్ 30 లాంటి అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు మధు. తెలుగులో ఆర్జీవీ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాను నిర్మించాడు. ఆర్జీవీ మేనమామ మురళి రాజు తనయుడు మధు మంతెన. ఇటీవలే మురళి రాజు కొన్ని నెలల క్రితం మరణించారు. తాజాగా మధు మంతెన రెండో వివాహం చేసుకున్నారు.
మధు మంతెన గతంలో నందన సేన్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపారు. అనంతరం బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మసబా గుప్తాను 2015 లో వివాహం చేసుకొని 2019 లో విడిపోయారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని ఆదివారం జూన్ 11న వివాహం చేసుకున్నాడు మధు మంతెన. పలువురు సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరవగా, పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.