Ramayana: శ్రీరాముడి ఆగమనానికి ముహూర్తం ఫిక్స్.. 150 సెకన్ల మ్యాజిక్.. రామాయణ టీజర్ అప్డేట్
హనుమాన్ జయంతి రోజున 'రామాయణ(Ramayana)' టీజర్ విడుదల చేయనున్నారు మేకర్స్.
Bollywood ramayana part 1 teaser update
- బాలీవుడ్ లో ‘రామాయణ’ మూవీ
- హనుమాన్ జయంతి రోజున టీజర్
- భారీ విజువల్స్ తో, హాలీవుడ్ రేంజ్ లో
Ramayana: బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తుండటం ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
Pragya Jaiswal: కవ్విస్తున్న కళ్లు.. మెరిసిపోతున్న అందాలు.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ అరాచకం!
తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్బంగా రామాయణ(Ramayana) టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతోంది. సుమారు 2 నిమిషాల 30 సెకన్ల నిడివితో రానున్న ఈ టీజర్ ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సెట్టింగ్స్, పాత్రల పరిచయంతో ఈ టీజర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుందట. ముఖ్యంగా రణబీర్ కపూర్ శ్రీరాముడి గెటప్, సాయి పల్లవి సీత లుక్ టీజర్ కె హైలెట్ కానున్నాయట.
భారీ బడ్జెట్‌తో, ఇండియా లెవల్లో ఉన్న స్టార్ యాక్టర్స్ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ పురాణ ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. హనుమాన్ జయంతి రోజున రాబోయే ఈ అప్డేట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా 2026 దివాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
