Bollywood Star Hero will Play Key Role in Manchu Vishnu Kannappa Movie Rumours goes Viral
Kannappa Movie : మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి, కన్నప్ప చరిత్ర కథాంశంతో ఈ సినిమాని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కన్నప్ప సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు.
ఇప్పటికే కన్నప్ప సినిమా న్యూజిలాండ్ అడవుల్లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా న్యూజిలాండ్ అడవుల్లో భారీగా, చాలా మంది స్టార్ కాస్ట్ తో చేశారు. అలాగే ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో కన్నప్ప షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నట్టు పలువురు పేర్లు ప్రకటించారు మూవీ యూనిట్.
కన్నప్ప సినిమాలో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతీ ముకుందన్, భాస్కరన్ ఐశ్వర్య, ముఖేష్ రుషి.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో పేరు వినిపిస్తున్నది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఓ గెస్ట్ రోల్ కన్నప్ప సినిమాలో చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇండియాలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని తీసుకొచ్చాడు మంచు విష్ణు. ఇంకెంతమంది స్టార్స్ ని తీసుకొస్తాడో విష్ణు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతమంది స్టార్స్ ఉంటే కన్నప్ప సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే వస్తాయని తెలుస్తుంది.