Pushpa2 The Rule Teaser : ‘పుష్ప – ది రూల్’ టీజర్ వచ్చేసింది.. జాతరలో అల్లు అర్జున్ అమ్మవారి రూపం.. తగ్గేదేలే..
నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పుష్ప ది రూల్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 టీజర్ ట్రెండింగ్ లో ఉంది.

Allu Arjun Sukumar Rashmika Pushpa2 The Rule Teaser Released
Pushpa2 The Rule Teaser : సుకుమార్(Sukumar) – అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. 300 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించాడు. టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం పెట్టె రేంజ్ కి ఎదిగాడు. ఇలా ఎన్నో ఘనతలు పుష్ప సినిమాతో సాధించాడు బన్నీ.
దీంతో పుష్ప పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప సినిమా వచ్చి రెండున్నరేళ్లు కావొస్తుంది. అభిమానులు పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ పేరుతో పార్ట్ 2 ఆగస్టు 15న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఓ గ్లింప్స్, కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసి పుష్ప పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెంచారు. తాజాగా నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పుష్ప ది రూల్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 టీజర్ ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా పుష్ప ది రూల్ టీజర్ చూసేయండి.
ఇక ఈ టీజర్ లో తిరుపతి గంగమ్మ జాతరలో అమ్మవారిలా తయారయి అల్లు అర్జున్ మాస్ ఫైట్ తో కనపడ్డాడు. దీంతో ఈ జాతర సీక్వెన్స్ సినిమాలో అదిరిపోతుందని తెలుస్తుంది. ఈ జాతర సీక్వెన్స్ లో ఒక పాట, ఒక మాస్ ఫైట్ ఉండనుందని సమాచారం. టీజర్ లోనే అల్లు అర్జున్ విశ్వరూపం చూపించేసాడంటే ఇక సినిమాలో మాస్ జాతరే అంటున్నారు అభిమానులు.