Allu Arjun : అర్ధరాత్రి అభిమానుల కోసం అల్లు అర్జున్.. బర్త్‌డే విషెష్ చెప్పడానికి బన్నీ ఇంటి ముందు భారీగా ఫ్యాన్స్..

అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. బన్నీ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Allu Arjun : అర్ధరాత్రి అభిమానుల కోసం అల్లు అర్జున్.. బర్త్‌డే విషెష్ చెప్పడానికి బన్నీ ఇంటి ముందు భారీగా ఫ్యాన్స్..

Allu Arjun Fans Arrived on Midnight at Allu Arjun home for wishing him on Birthday

Updated On : April 8, 2024 / 8:25 AM IST

Allu Arjun : నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. నిన్న రాత్రి నుంచి అభిమానులు హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు, ప్రముఖులు, నెటిజన్లు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం బన్నీ పుట్టినరోజు మరింత స్పెషల్. పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత వచ్చిన మొదటి బర్త్ డే, ఈ సంవత్సరమే పుష్ప 2 కూడా రిలీజ్ కాబోతుంది. టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం పెట్టారు. ఇలా ఎన్నో సాధించిన తర్వాత ఈ సంవత్సరం అల్లు అర్జున్ బర్త్ డే మరింత స్పెషల్ గా మారింది.

దీంతో అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. బన్నీ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే కొంతమంది అభిమానులు నిన్న అర్ధరాత్రే అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని అల్లు అర్జున్ ఇంటి ముందు భారీగా చేరుకొని సందడి చేశారు. అరుపులు, విజిల్స్ తో హడావిడి చేశారు. దీంతో అల్లు అర్జున్ అర్ధరాత్రి అభిమానుల కోసం బయటకి వచ్చారు.

Also Read : Manchu Vishnu : మొన్నేమో అంత రచ్చ.. ఈసారి ఏకగ్రీవంగా ఎన్నిక.. మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..

అల్లు అర్జున్ తన ఇంటి గేటుకి లోపల వైపు నిల్చొని అభిమానులకు అభివాదం తెలిపారు. అభిమానులంతా విషెష్ తెలుపుతుండగా థ్యాంక్యూ తెలిపారు. పలువురు అభిమానులు ఇచ్చిన గిఫ్ట్స్ ని తీసుకున్నారు. తన బర్త్ డే అని వచ్చిన అభిమానుల కోసం బన్నీ అర్ధరాత్రి పూట సమయం కేటాయించి మరీ ఉన్నారు. దీంతో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.