Manchu Vishnu : మొన్నేమో అంత రచ్చ.. ఈసారి ఏకగ్రీవంగా ఎన్నిక.. మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..

గత మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల మాదిరి జరిగాయి. గొడవలు, ఆరోపణలతో టాలీవుడ్ లో ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. కానీ ఈసారి..

Manchu Vishnu : మొన్నేమో అంత రచ్చ.. ఈసారి ఏకగ్రీవంగా ఎన్నిక.. మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..

Manchu Vishnu is again elected as president in MAA elections

Updated On : April 7, 2024 / 9:57 PM IST

Manchu Vishnu : టాలీవుడ్ లో ప్రతి రెండేళ్లకు ఒకసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) జరుగుతాయి అన్న విషయం అందరికి తెలిసిందే. 1993లో మొదలైన ఈ అసోసియేషన్ ఎన్నికలు.. ప్రతిసారి ప్రశాంతంగానే జరుగుతూ వచ్చాయి. కానీ 2019, 2021 ఎన్నికలు మాత్రం కొన్ని గొడవలతో జరిగాయి. గత ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజు పోటీ పడ్డారు. అయితే ఈ పోటీ వీరిద్దరి మధ్య కాకుండా మంచు అండ్ మెగా ఫ్యామిలీ మధ్య అన్నట్లు సాగింది.

దీంతో గత మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల మాదిరి జరిగాయి. గొడవలు, ఆరోపణలతో టాలీవుడ్ లో ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. ఇక ఆ ఎన్నికలు అంత రచ్చ రచ్చ మీద జరిగితే.. ఈ విడత ఎన్నికలు ఏమో ఎటువంటి హడావుడి లేకుండా ఏకగ్రీవంగా పూర్తీ అయ్యాయి. 26 మంది కమిటీ సభ్యులు కలిసి ఈసారి ఎన్నికలను ఏకగ్రీవంగా ముగించారు.

Also read : Dil Raju : సినిమా రివ్యూలపై కేరళ కోర్టు ఇచ్చిన తీర్పు.. ఇక్కడ కూడా తీసుకు రావాలంటున్న దిల్ రాజు..

మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకి పదవిని అందించారు. అలాగే రఘు బాబు జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజర్‌గా, మధుమిత, శైలజ, జై వాణి ఈసీ మెంబెర్స్ గా ఎన్నికయ్యారు. ఇక ఈ రెండేళ్లలో విష్ణు పనితీరు పై లైఫ్ మెంబెర్స్ ప్రశంసలు కురిపించారు. ఇక మరోసారి అధ్యక్షుడిగా ఎంపికైన విష్ణు.. మా అసోసిషన్ నూతన భవనం నిర్మించే వరకు తానే అధ్యక్షుడిగా ఉంటాను అంటూ తీర్మానం చేశారు. అంతేకాదు ఈసారి మూడేళ్ళ వరకు ఎన్నికల జరిగే అవకాశం లేదని. ఐదేళ్లు పాటు ఒక్కే అదేక్షుడు కొనసాగడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందని పేర్కొన్నారు.