×
Ad

Kumar Sanu : విడిపోయిన 31 ఏళ్ళ తర్వాత మాజీ భార్య మీద కేసు వేసిన స్టార్ సింగర్.. 30 లక్షలు ఇవ్వాలంటూ..

కుమార్ సాను తాజాగా మరోసారి వైరల్ అవుతున్నారు. (Kumar Sanu)

Kumar Sanu

Kumar Sanu : బాలీవుడ్ స్టార్ సింగర్స్ లో కుమార్ సాను ఒకరు. హిందీ, బెంగాలీ, తెలుగు, కన్నడ, ఒరియా సినిమాలలో వందల పాటలు పాడారు. తెలుగులో జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆయధం.. ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో చాలా సాంగ్స్ పాడారు. గతంలో ఆయన రిలేషన్స్ తో వార్తల్లో నిలిచిన కుమార్ సాను తాజాగా మరోసారి వైరల్ అవుతున్నారు. (Kumar Sanu)

కుమార్ సాను 1980లో సింగర్ రీటా భట్టాచార్యని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 1994 లో ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత కుమార్ సాను కొన్నాళ్ళు నటి కుణిక సదానంద్ తో రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత లాయర్ సలోని భట్టాచార్యని పెళ్లి చేసుకున్నారు.

Also Read : OTT : ఓటీటీలకు పండగే.. సెన్సార్ లేదు.. ఇక అడల్ట్ కంటెంట్ మరింత పెరుగుతుందా?

కొన్ని నెలల క్రితం కుమార్ సాను మొదటి భార్య రీటా భట్టాచార్య పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలలో తన మాజీ భర్త కుమార్ సాను పై, అతనితో పెళ్లి, ప్రగ్నెన్సీ విషయాలపై పలు ఆరోపణలు చేసింది. కుమార్ సానుపై నెగిటివ్ గా మాట్లాడింది. దీంతో కుమార్ సాను ముంబై హైకోర్టులో రీటా భట్టాచార్యపై కేసు వేసాడు.

డైవర్స్ అగ్రిమెంట్ ఉల్లంఘించి పెళ్లి, ప్రగ్నెన్సీ పై పలు ఇంటర్వ్యూలలో అబద్దపు మాటలు మాట్లాడి తన పరువుకు భంగం కలిగించారని చెప్తూ అందుకు నష్టం కింద 30 లక్షలు చెల్లించాలని పరువు నష్టం కేసు వేసి రీటాకు నోటీసులు పంపించారు. అలాగే ఆ ఇంటర్వ్యూలు కూడా తీసేయాలని లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులు పంపారు.

Also Read : Vaishnavi Kokkura : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా అంటూ..

మరి దీనిపై రీటా ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే విడిపోయిన 31 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా రీటా అప్పటి సంగతులు మాట్లాడటం, కుమార్ సాను కేసు వేయడంతో వీరిద్దరూ బాలీవుడ్ వార్తల్లో నిలుస్తున్నారు.