Vikrant Massey : భార్య కాళ్లు మొక్కిన హీరో.. ఎవరో తెలుసా?

Bollywood Star Vikrant Massey karva chauth with Wife pics goes viral
Vikrant Massey : ఉత్తరాధిలో కర్వా చౌత్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటారు. తమ భర్త కోసం ఈ పూజను చేస్తుంటారు. అయితే ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ ఈ పండుగ జరుపుకున్న ఫోటోలను షేర్ చేశారు. తాజాగా 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మస్సే కూడా తన భార్యతో కలిసి కర్వా చౌత్ జరుపుకున్నాడు. ఆ ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇందులో ఈ దంపతులు చూడముచ్చటగా కనిపించారు.
Also Read : Ananya Nagalla : మహిళా ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వండి.. ఆ ఇష్యూకు కౌంటర్ గా అనన్య నాగళ్ళ వ్యాఖ్యలు..
విక్రాంత్ భార్య పేరు షీతల్. అందరిలాగే షీతల్ విక్రాంత్ ముఖాన్ని జల్లెడలో చూసింది. ఆ తర్వాత తన భర్త కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. అనంతరం తన భర్త విక్రాంత్ సైతం షీతల్ కాళ్లు మొక్కాడు. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వాళ్లకి ఒకరి పట్ల ఒకరికి ఎంత గౌరవం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
ఇక విక్రాంత్, షీతల్ కి 2022లో వివాహం జరిగింది. ఈ ఏడాది వీరికి కుమారుడు సైతం జన్మించాడు. 12th ఫెయిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రాంత్.