Ananya Nagalla : మహిళా ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వండి.. ఆ ఇష్యూకు కౌంటర్ గా అనన్య నాగళ్ళ వ్యాఖ్యలు..
పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్లో అనన్య నాగళ్ళ మాట్లాడింది.

Ananya Nagalla Comments on Recent Issue in Pottel Movie Pre Release Event goes Viral
Ananya Nagalla : ఇటీవలే అనన్య నాగళ్ళ తన పొట్టేల్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనగా ఓ మహిళా జర్నలిస్టు ఇండస్ట్రీలో కమిట్మెంట్ అంటూ అసభ్యకరంగా ప్రశ్నలు అడిగింది. అప్పుడే అనన్య దానికి కౌంటర్ ఇచ్చినా ఆ జర్నలిస్ట్ వదలకుండా దాని గురించే అడగడంతో వైరల్ గా మారింది. దీంతో ఆ జర్నలిస్ట్, ఆమె అడిగిన ప్రశ్న వైరల్ గా మారింది. ఆ మహిళా జర్నలిస్టు పై అనన్య ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కూడా విమర్శలు చేశారు. ఫిలిం ఛాంబర్ కూడా దీన్ని ఖండిస్తూ లేఖ విడుదల చేసింది.
Also Read : Richest TV Actor : మనదేశంలో రిచెస్ట్ టీవీ స్టార్ ఎవరో తెలుసా..?
అయితే నిన్న పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్లో అనన్య నాగళ్ళ మాట్లాడింది. తన స్పీచ్ అయిపోయిన తర్వాత చివర్లో.. ఫిమేల్ యాక్టర్స్ అనగానే మేకప్ వేసుకొని ఉంటారు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. వాళ్ళకి లోపల హార్ట్ ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు అని కాదు. మాకు కొంచెం రెస్పెక్ట్ కూడా కావాలి ప్లీజ్ అంటూ మాట్లాడింది.
మేకప్ వేసుకున్న వాళ్లకు మనసు ఉండదా?
మాకూ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి
– అనన్య నాగళ్ళ pic.twitter.com/GfUXoHjkaz
— Telugu360 (@Telugu360) October 21, 2024
దీంతో ఈ వ్యాఖ్యలు ఆ ఇష్యూ గురించే అని, అనన్య ఆ మహిళా జర్నలిస్ట్ కి కౌంటర్ ఇచ్చిందని, అలాగే ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులను చిన్నగా చూసేవారికి కూడా ఈ వ్యాఖ్యలతో సమాధానం ఇచ్చిందని భావిస్తున్నారు. ప్రస్తుతం అనన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.