Richest TV Actor : మనదేశంలో రిచెస్ట్ టీవీ స్టార్ ఎవరో తెలుసా..?
సినిమాల్లో నటించే వాళ్లతో పోలిస్తే టీవీ షోలు, సీరియల్స్ చేసే వారికి సంపాదన తక్కువగానే ఉంటుంది.

Indias Richest tv star how many crores of assets
సినిమాల్లో నటించే వాళ్లతో పోలిస్తే టీవీ షోలు, సీరియల్స్ చేసే వారికి సంపాదన తక్కువగానే ఉంటుంది. అయితే.. కొందరు బుల్లితెర నటులు సినిమా వాళ్లకు ఏ మాత్రం తక్కువ కాదు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్‌గా ఎదిగారు కపిల్ శర్మ. మనీ కంట్రోల్ రిపోర్టు ప్రకారం.. కపిల్ శర్మ ఒక్కొ ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు తీసుకుంటాడట.
ఇక అతడి మొత్తం ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైనే ఉంటుందని రిపోర్టు తెలిపింది. అతడు ముంబైలో రూ.15కోట్ల విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇక చండీగఢ్‌లో రూ.25 కోట్ల విలువైన ఫాంహౌస్ ఉంది. ఇక ఈయనకు కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర మెర్సిడెస్, రేంజ్ రోవర్ సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి.
Namrata Shirodkar – Sonali Bendre : మహేష్ బాబు హీరోయిన్‌తో మహేష్ భార్య.. క్యాన్సర్ పై పోరాటం..
భారత దేశంలో అత్యధిక రేటింగ్ సంపాదించే సీరియల్ అనుపమ. ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించే రూపాలీ గంగూలీ ఒక్కొ ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు తీసుకుంటుంది. తారక్ మెహతా కా ఊల్టా చష్మా లో లీడ్ పాత్ర పోషించే నటుడు దిలీప్ జోషి కూడా ఒక్కొ ఎపిసోడ్‌కు రూ.2 లక్షలు తీసుకుంటాడని తెలుస్తోంది.
2007లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో తన కామెడీతో కపిల్ కడుపుబ్బా నవ్వించాడు. 2013లో కామెడీ నైట్స్ విత్ కపిల్, 2016లో ది కపిల్ శర్మ షోకి హోస్ట్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.