Namrata Shirodkar – Sonali Bendre : మహేష్ బాబు హీరోయిన్‌తో మహేష్ భార్య.. క్యాన్సర్ పై పోరాటం..
తాజాగా సోనాలి బింద్రేని మహేష్ బాబు భార్య కలవడంతో చర్చగా మారింది.

Mahesh Babu Wife Namrata Shirodkar meets Actress Sonali Bendre Photo goes Viral
Namrata Shirodkar – Sonali Bendre : తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ సోనాలి బింద్రేని కలిసింది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. సోనాలి బింద్రే మహేష్ తో మురారి లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమా ఇటీవలే రీ రిలీజ్ అయి మరోసారి ప్రేక్షకులని అలరించింది. తాజాగా సోనాలి బింద్రేని మహేష్ బాబు భార్య కలవడంతో చర్చగా మారింది.
Also Read : Devara – Princy George : ‘దేవర’లో ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేసిన అంధురాలు.. ఆ పాత్ర చేసింది ఎవరో తెలుసా..?
నమ్రత, సోనాలి బింద్రే, పింకీ రెడ్డి.. కలిసి ఉన్న ఫోటోని నమ్రత షేర్ చేసి.. GVK హెల్త్ హబ్ లో పింకీ రెడ్డి నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఇలాంటి క్యాంపైన్ చేయడం ద్వారా నన్ను ఇన్ స్పైర్ చేసారు. సోనాలి బింద్రేని కలవడం ఆనందంగా ఉంది. తరువాత కలిసినప్పుడు మాత్రం ఇంట్లో కలిసి టీ తాగుతూ మాట్లాడుకుందాము. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం మర్చిపోకండి అని పోస్ట్ చేసింది.
హీరోయిన్ సోనాలి బింద్రే గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సోనాలి బింద్రే, నమ్రత శిరోద్కర్ కలిసి క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడం, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడంతో అభిమానులు, నెటిజన్లు వీరిని అభినందిస్తున్నారు.