Boman Irani Peddi: సుల్తాన్, దంగల్ తో ‘పెద్ది’కి పోలిక.. బోమన్ ఇరానీ ఎందుకు అలా అన్నాడు అసలు!
Boman Irani: రామ్ చరణ్ పెద్ది(Peddi) గురించి బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
- V Santhosh Kumar
- Updated on- May 22, 2026 / 12:55 PM IST
Boman Irani Comments On Ram Charan Peddi Movie
- ‘పెద్ది’ ప్రమోషన్లలో బాలీవుడ్ నటులు.
- బోమన్ ఇరానీ హ్యాపీ కామెంట్స్.
- భోపాల్‌లో రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్.
Boman Irani Peddi: సాధారణంగా టాలీవుడ్ చిత్రాలలో నటించే బాలీవుడ్ నటులు ప్రమోషన్లలో అంతగా కనిపించరు. గతంలో ‘ఆదిపురుష్’ విలన్ సైఫ్ అలీ ఖాన్ ప్రచారానికి దూరంగా ఉండటమే దీనికి ఉదాహరణ. కానీ, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం విషయంలో సీన్ పూర్తిగా మారింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ హిందీ నటుడు బోమన్ ఇరానీ, మరో నటుడు దివ్యెందు శర్మ ముంబై మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై భారీ ఎలివేషన్లు ఇస్తున్నారు.
‘సుల్తాన్’, ‘దంగల్’ చిత్రాలతో ‘పెద్ది(Peddi)’కి పోలికలు రావడం సహజమేనని, అయితే ట్రైలర్‌లో చూసింది కేవలం శాంపిల్ మాత్రమేనని బోమన్ ఇరానీ పేర్కొన్నారు. అసలు సినిమా ప్రేక్షకులను వెంటాడుతుందని, ఇలాంటి అరుదైన చిత్రాలు చాలా తక్కువగా వస్తాయని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గతంలో ‘అత్తారింటికి దారేది’తో మెప్పించిన బోమన్ ఇరానీ ఇంతలా నమ్మకంగా చెప్పడంతో మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. నార్త్ హక్కులు సొంతం చేసుకున్న జియో స్టూడియోస్ కూడా అక్కడ భారీ స్థాయిలో పబ్లిసిటీ చేస్తోంది.
మరో రెండు వారాల్లో విడుదల కానున్న ఈ సినిమా హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ట్రైలర్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, గ్రౌండ్ లెవెల్‌లో సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని దర్శకుడు బుచ్చిబాబు బృందం ధీమాగా ఉంది. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ లెక్కలు మారిపోతాయని, మొదటి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావడం ఖాయమని చిత్రబృందం థియేటర్లను సిద్ధం చేస్తోంది.
