Boney Kapoor : శ్రీదేవిది సహజమరణం కాదు.. ప్రమాదవశాత్తు.. మొదటిసారి శ్రీదేవి మరణంపై బోనికపూర్ సంచలన వ్యాఖ్యలు..

శ్రీదేవి మరణంపై, దుబాయ్ లో జరిగిన పరిస్థితులపై బోనికపూర్ ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి శ్రీదేవి మరణం గురించి, ఆమె మరణం తర్వాత బోనికపూర్ దుబాయ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు.

Boney Kapoor first time reacts on Sridevi Demise sensational comments on Sridevi and Dubai Police

Boney Kapoor : వెండితెరపై తన అందంతో, అభినయంతో ఎన్నో వందల సినిమాలతో భారతదేశ ప్రేక్షకులని మెప్పించింది శ్రీదేవి. ఎంతోమందికి కలలరాణిగా నిలిచింది. దాదాపు మూడు దశభిధాలు తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా రూల్ చేసింది. బోని కపూర్ తో వివాహం తర్వాత ముంబైకి వెళ్లి సెటిల్ అయిపోయి ఎప్పుడో ఒకసారి అడపాదడపా సినిమాల్లో కనిపించేది.

2018లో శ్రీదేవి దుబాయ్ లో ఓ పెళ్ళికి వెళ్లగా అక్కడ హోటల్ లో బాత్ టబ్ లో పడి మరణించింది. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. శ్రీదేవి మరణం కొన్ని కోట్ల మందికి తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే శ్రీదేవి ఎక్కడో విదేశాల్లో చనిపోవడం, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చనిపోవడం, ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరణించడంతో బోని కపూర్ పై అనుమానాలొచ్చాయి. దీంతో దుబాయ్ పోలీసులు అప్పుడు బోనికపూర్ ని అదుపులోకి తీసుకొని విచారించారు కూడా.

శ్రీదేవి మరణంపై, దుబాయ్ లో జరిగిన పరిస్థితులపై బోనికపూర్ ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి శ్రీదేవి మరణం గురించి, ఆమె మరణం తర్వాత బోనికపూర్ దుబాయ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు. బోని కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి చనిపోయాక అందరూ నన్ను అనుమానించారు. ఇండియన్ ఎంబసీ నుంచి దుబాయ్ పోలీసుల మీద ఒత్తిడి రావడంతో నన్ను అదుపులోకి తీసుకొని దాదాపు 24 గంటల పాటు విచారించారు. అన్ని రకాల టెస్టులు చేశారు. లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేసారు. నేను ఏ తప్పు చేయలేదు అని తెలిసిన తర్వాతే నన్ను విడిచిపెట్టారు అని అన్నారు.

Also Read : Bigg Boss 7 Day 29 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నదెవరు? బిగ్‌బాస్ కూడా తొండాట ఆడుతున్నడని శివాజీ ఫైర్..

ఇక శ్రీదేవి మరణం గురించి మాట్లాడుతూ.. శ్రీదేవిది సహజ మరణం కాదు, ప్రదవశాత్తు జరిగింది. ఆమె స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యేది. తన బాడీ, అందం, బరువు కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి డైట్ ఫాలో అవుతూనే ఉండేది. తన ఆహారంలో ఉప్పు తీసుకునేది కాదు. దీంతో కొన్ని సార్లు లోబిపి వచ్చి కూడా పడిపోయింది. డాక్టర్లు హెచ్చరించారు కూడా. అయినా డైట్ విషయంలో వినలేదు. మా పెళ్లి తర్వాత కొన్నాళ్ళకు ఈ విషయం నాకు తెలిసింది. శ్రీదేవి మరణం తర్వాత నాగార్జునని కలిసినప్పుడు అతను కూడా శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యేదని, షూటింగ్ లో రెండు మూడు సార్లు లోబిపితో పడిపోయిందని చెప్పాడు అని తెలిపారు. దీంతో శ్రీదేవి మరణం తర్వాత మొదటిసారి బోనికపూర్ మాట్లాడగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.