‘బాయ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వంశీ పైడిపల్లి
విశ్వరాజ్ క్రీయోషన్స్ బ్యానర్ పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘BOY’.

విశ్వరాజ్ క్రీయోషన్స్ బ్యానర్ పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘BOY’.
విశ్వరాజ్ క్రీయోషన్స్ బ్యానర్ పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘BOY’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు “మహర్షి ” సెట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేసారు.
ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. బాయ్ స్టేజ్‌లో ప్రతి ఒక్కరికీ చాలా మెమొరీస్ ఉంటాయి. హై స్కూల్ యూనిఫాం లో ఉన్న స్టూడెంట్ స్కూల్ వైపు చూస్తూ ఉన్న ఈ పోస్టర్ వెనకున్న కాన్సెప్ట్ చూస్తుంటే, నాకు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి.
అమర్‌కు సినిమా అంటే చెప్పలనేంత ఇష్టం. పోస్టర్ విషయంలోనే ఇంత శ్రద్ద తీసుకుంటే సినిమా ఇంకా బాగా తీసుంటారని అర్ధమవుతుంది. సమయం కుదుర్చుకుని ఈ సినిమా చూడాలనుంది అని అన్నారు. దర్శకుడు అమర్‌కి, “boy” చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్పారు.
Read Also : బర్త్‌డే పార్టీలో మహేష్, తారక్ సందడి!