Boyapati Rapo Movie last schedule shooting in Mysore Sreeleela post Special photos
Ram -Boyapati : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్ ఓ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ వైరల్ అయింది. రామ్ లుక్ మార్చేసి మరింత మాస్ గా తయారయ్యాడు.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయిన రామ్ బోయపాటి సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టింది. కర్ణాటకలోని మైసూరు, చుట్టూ పక్కన ప్రాంతాల్లో రామ్ బోయపాటి సినిమా ఇవాళ్టి నుంచి షూటింగ్ జరగనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. జూన్ 15 వరకు ఈ షూటింగ్ జరగనుంది. ఇక దీనిపై హీరోయిన్ శ్రీలీల స్పెషల్ పోస్ట్ చేసింది. ఫ్లైట్ లో వెళ్లిన చిత్రయూనిట్ ఎయిర్ పోర్ట్ లో దిగాక శ్రీలీల, రామ్ కలిసి దిగిన ఫోటోలని షేర్ చేశారు.
Movies : ఈ వారం తెలుగులో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే..
రామ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసిన శ్రీలీల.. రామ్ బోయపాటి సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. చివరి షెడ్యూల్ షూటింగ్ మా ఊర్లోనే జరగబోతుంది అని ట్వీట్ చేసింది. శ్రీలీల కన్నడ భామ అని తెలిసిందే. దీంతో రామ్, శ్రీలీల ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
#BoyapatiRAPO team kickstarted the Final Schedule Today in Mysore & it will continue till June 15?
Film completes its shoot except for a song#BoyapatiRAPOonOct20
USTAAD @ramsayz #BoyapatiSreenu @sreeleela14 @MusicThaman @detakesantosh @SS_Screens @ZeeStudios_ @jungleemusicSTH pic.twitter.com/QRjbgcRuZT— ??????????? (@UrsVamsiShekar) June 6, 2023